Public opinion
-
Budget-2025: బడ్జెట్లో మాకేంటి?
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థికమంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) చదివే పద్దుపై అందరిలోనూ అంచనాలున్నాయి. ఆదాయ పన్ను విషయంలో ఊరట ఉంటుందా? ధరలు తగ్గిస్తారా?. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? ఇలా రకరకాల ప్రశ్నలకు ఆరోజున సమాధానం దొరకనుంది. అయితే సాధారణంగా బడ్జెట్‌తో మాకేంటి? అని జనం అనుకుంటారనే భావన ఒకటి ఉంది. కానీ, అది తప్పని సాక్షి.కామ్ ప్రయత్నం నిరూపించింది. బడ్జెట్లో మాకేంటి అంటున్న ‘సామాన్యుడి’ మనోగతం వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం.. 👉సాధారణ ప్రజలకు మాదిరిగా కాకుండా.. సూపర్ రిచ్ వారికి కొంత ట్యాక్స్ పెంచాలి. ఎందుకంటే సాధారణ ప్రజలు, కోటీశ్వరులు ఇద్దరూ కూడా సమానంగా ట్యాక్స్ కడుతున్నారు. ఇది ధనవంతులపై ప్రభావం చూపకపోయినా, సామాన్యులకు భారంగా ఉంటుందని కార్పొరేట్ ఉద్యోగి అన్నారు. టోల్ గేట్ చార్జీలను కూడా కొంత తగ్గిస్తే బాగుంటుందని కూడా పేర్కొన్నారు.👉భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయ రంగానికి కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. రైతుకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉంటే బాగుంటుందని.. చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు పేర్కొన్నారు.👉మధ్యతరగతి వేతన జీవులు.. ప్రతీసారి బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ చివరకు నిరాశే మిగులుతూ వస్తోంది. ఈసారైనా మాలాంటి వాళ్ళను దృష్టిలో ఉంచుకుని ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల, కొంత ఉపశమనం లభిస్తుంది. అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఆరోగ్య రంగానికి బడ్జెట్లో ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటోంది. కాబట్టి ఈసారి బడ్జెట్లో మరీ ముఖ్యంగా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ::ఏపీకి చెందిన ఓ వైద్యుడి అభిప్రాయం👉ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే, అందరికి ఉపయోగకరంగా ఉంటుందని, మదనపల్లెకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2025పై తన ఆశాభావం వ్యక్తం చేశారు.👉2025-26 బడ్జెట్లో నిత్యావసరాల ధరలపై ట్యాక్స్ తగ్గించాలని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మెదక్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్ధి చెప్పారు.👉బడ్జెట్ వచ్చినప్పుడల్లా.. ఏదేదో అంచనాలు వేసుకుంటూనే ఉంటాను. కానీ అంచనాలను తగ్గట్టుగా ఎప్పుడూ బడ్జెట్ ఉండటం లేదు. ఈ సారైనా నిత్యావసర వస్తువులపై ట్యాక్స్ తగ్గించాలని జర్నలిస్ట్ పేర్కొన్నారు.👉నిత్యావసరాల ధరలతో పాటు ఎలక్ట్రానిక్స్ & ఆటోమొబైల్ మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని ఆశిస్తున్నట్లు.. హైదరాబాద్‌లో కెమెరామెన్‌గా పని చేసే వ్యక్తి చెప్పారు.👉సీనియర్ సిటిజన్, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి, ఈ బడ్జెట్ 2025పై స్పందిస్తూ.. వ్యవసాయదారులకు అవసరమైన పథకాలను మరిన్ని ప్రవేశపెట్టాలని, వ్యవసాయ పనిముట్ల మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని పేర్కొన్నారు.:: సిరికుమార్, సాక్షి వెబ్ బిజినెస్ డెస్క్ -
ఎవరినడిగి విద్యుత్ చార్జీలు పెంచారు?
సాక్షి, అమరావతి: ‘రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీలను ఎవరినడిగి పెంచారు? కనీసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు’ అని ప్రతిపక్ష పార్టీల నేతలు, వివిధ వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన వార్షిక ఆదాయ, అవసరాల నివేదికలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మంగళవారం బహిరంగ విచారణ చేపట్టింది. మండలి ఇన్చార్జ్ చైర్మన్ ఠాగూర్ రామ్‌సింగ్, సభ్యుడు పీవీఆర్ రెడ్డి విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అభిప్రాయాలు సేకరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రజలపై మోపుతున్న అదనపు విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా, ట్రూ అప్, సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను పెట్టవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. బహిరంగ విచారణ జరుగుతున్న వేదిక వద్ద వివిధ రాజకీయ పార్టీలతోపాటు వినియోగదారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.15 వేల కోట్లకుపైగా భారం మోపిందన్నారు.గత ప్రభుత్వం చేసిన మంచిని కొనసాగించాలివిద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం మాటతప్పి నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు, వృత్తిదారులకు ఉచిత, సబ్సిడీ విద్యుత్ ఇవ్వడం మంచిపని అని..దానిని కూటమి ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. ‘షార్ట్ టెర్మ్’ పేరుతో రూ.వేల కోట్ల అవినీతి జరుగుతోందని, దీనిపై విచారణ చేయాలన్నారు.సౌర విద్యుత్‌పై జీఓ ఏదీ..?గత ప్రభుత్వ తప్పులు వెతకడం అనసరమని ఫార్మర్స్ ఫెడరేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ వేణుగోపాలరావు అన్నారు. సౌర విద్యుత్‌ను ఒడిసిపట్టుకుంటామనిప్రకటనలు చేయడం తప్ప ఇంతవరకూ కూటమి ప్రభుత్వం జీఓ జారీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శీర్షాసనం చేసి ఆయన నిరసన తెలిపారు.ప్రజల పక్షాన వైఎస్సార్సీపీమాకు ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచమని, తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీఇచ్చి ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.15,485 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపైమోపుతున్నారన్నారు. పెంచిన చార్జీలు రద్దు చేసి, ప్రజల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే ఉపసంహరించాలని ఏపీఈఆర్సీని కోరినట్లు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తెలిపారు. -
రైతు భరోసాపై ప్రజాభిప్రాయం
-
ప్రజాభిప్రాయం మేరకే ‘రైతు భరోసా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ఎలా అమలు చేయా లన్న అంశంపై ప్రజాభిప్రాయం మేరకే ముందుకెళ్లాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ పథకం పరిధిలోకి వచ్చే భాగస్వామ్య పక్షాలతో పాటు మే«థావులు, సామాన్య ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించిన తర్వాతే విధివిధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని అభిప్రాయ పడింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు గాను ఈనెల 11–16 తేదీల్లో ఉపసంఘంలోని మంత్రులు, ఇన్చార్జి మంత్రులు జిల్లా కేంద్రాల్లో పర్యటించాలని, విస్తృత స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ సమావేశాల్లో అభిప్రాయం తెలిపేందుకు గాను ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించాలని ఉపసంఘం నిర్ణయించింది. రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన గంటకు పైగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాగులో లేకున్నా రైతుబంధు ఇచ్చారు!గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు అమలు చేసిన తీరు, సీజన్ల వారీగా అయిన ఖర్చు, ఎంత మంది రైతులకు.. ఎన్ని ఎకరాల భూమి ఉందన్న అంశాలను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు ఉపసంఘానికి వివరించారు. గత రెండు సీజన్లలో రైతుబంధు ఇచ్చిన తర్వాత తమ శాఖ నేతృత్వంలో పరిశీలన జరిపామని, ఈ సందర్భంగా ఎలాంటి సాగు చేయకుండానే 20 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చినట్టు తేలిందని ఆయన వెల్లడించారు. ఈ 20 లక్షల ఎకరాల్లో వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నా సాగు చేయకపోవచ్చని, ప్లాట్లు, కొండలు, గుట్టలు కూడా ఉండవచ్చని తెలిపారు.అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ఎవరెవరికి రైతు భరోసా అమలు చేయాలన్న దానిపై తొందరపడకూడదని, ప్రజల డబ్బును ప్రజల అభిప్రాయం మేరకు వెచ్చించాలని, వారి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఎలాంటి భూములకు రైతు భరోసా వర్తింపజేయాలి, ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలన్న దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాగు చేసే ప్రతి ఎకరానికీ రైతు భరోసా ఇస్తామని, వరంగల్ డిక్లరేషన్‌లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు కూడా ఈ సాయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మరోమారు సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. -
మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం (గత బీఆర్ఎస్ సర్కార్) బిడ్డింగ్ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకోవడం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టడంతో రాష్ట్రానికి నష్టం వాటిల్లిందంటూ వచ్చిన ఆరోపణలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ మంగళవారం బహిరంగ ప్రకటన జారీ చేసింది. సంబంధిత అంశాల్లో అవగాహన, అనుభవం, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, సంస్థలు 10 రోజుల్లోగా లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. cio2024.power@gmail.com కి మెయిల్ ద్వారా లేదా తమ కార్యాలయానికి (7వ అంతస్తు, బీఆర్కేఆర్ భవన్, ఆదర్శ్ నగర్, హైదరాబాద్– 500004) పోస్టు ద్వారా పంపాలని సూచించింది. విచారణ కమిషన్‌కు పంపించే విజ్ఞాపనల్లో వ్యక్తులపై ఎలాంటి రాజకీయపరమైన ఆరోపణలు చేయరాదని కోరింది. ఎవరైనా కమిషన్ ముందు హాజరై మౌఖికంగా ఆధారాలు సమరి్పంచాలని భావిస్తే, ఏ విషయంలో వారు హాజరుకావాలని కోరుకుంటున్నారో తెలియజేయాలంది. సంబంధిత నిర్ణయాల్లో తప్పులను గుర్తించడంతోపాటు రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టాన్ని నిర్ధారించడం, బాధ్యులను గుర్తించడం కోసం న్యాయవిచారణ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. -
నారావారి కిరాయి ముఠాలు.. తస్మాత్ జాగ్రత్త!
పచ్చపార్టీని ఓటమి భయం వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని వారి సర్వేల్లోనే తేలిపోయింది. జనసేన-బీజేపీలతో ప్రత్యక్షంగానూ కాంగ్రెస్ తో పరోక్షంగానూ కమ్యూనిస్టులతో సీక్రెట్ ఒప్పందాలతోనూ బరిలో దిగినా లాభం ఉండేలా లేదని తేలిపోయింది. దింపుడు కళ్లెం ఆశలు కూడా అడుగంటేశాయని అర్ధమైపోతోంది. ఇంత ఫ్రస్ట్రేషన్ లో వలంటీర్లపై కక్షసాధింపు కోసం తాము పన్నిన పాచిక తమనే లాగి లెంపకాయ కొట్టేయడంతో దవడ వాచిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో జనం అంతా జగన్ మోహన్ రెడ్డి యాత్రలోనే ఉన్నారని అర్ధం అయిపోయింది. మరేం చేయాలి? ఈ కష్టాల్లోనే చంద్రబాబు నాయుడికి ఓ దిక్కుమాలిన ఐడియా వచ్చింది. దాంతో పాలక పక్షం ఓడిపోతోందంటూ ప్రచారం చేయించడానికి మౌత్ టాక్ మల్లిగాళ్లకు కిరాయి డబ్బులిచ్చి ఊళ్లపైకి వదిలారు. అయితే వారిని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కొద్ది రోజులుగా మాయదారి ముఠాలు ఊళ్లల్లో తిరుగుతున్నాయి స్టూవర్ట్ పురం దొంగల ముఠాలకన్నా ప్రమాదకరమైన ముఠాలవి.చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలకోసం..ఆయన రాజకీయ ప్రత్యర్ధులపై విష ప్రచారం చేయడం ఈ ముఠాల పని. దీనికోసం వీరికి కిరాయి చెల్లిస్తున్నారు. ఈ ముఠాల అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చిందంటే... తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే. చంద్రబాబు నాయకత్వానికి కూడా. ఈ ఎన్నికల్లో కూడా ఓడి ఇంట్లోనే ఉండాల్సి వస్తే టీడీపీ దుకాణానికి తాళాలు వేయాల్సిందే. ప్రస్తుత వాతావరణం చూస్తోంటే ఈ సారి కూడా వైఎస్సార్సీపీ విజయమే ఖాయమని రక రకాల సర్వేలు చెబుతున్నాయి. టీడీపీకి ఈసారి మరింత ఘోర పరాభవం తప్పదని క్లారిటీ ఇస్తున్నారు అంతా. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపు కోట్లాది మంది ఆంధ్ర ప్రజల మనసులు మార్చడం తన వల్ల కాదని తెలిసిపోయింది. టీడీపీ గెలుస్తుందని చెప్పించుకున్నా ఎవరూ నమ్మరని అర్ధమైపోయింది. ఈ తరుణంలోనే చంద్రబాబు తనకే సాధ్యమైన ఓ క్షుద్ర ఆలోచనను మెదడులోంచి బయటకు తీశారు. ఆ ఆలోచన ఏంటంటే.. టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి గెలుస్తందని చెబితే ఎవరూ నమ్మరు కాబట్టి. వైఎస్సార్సీపీ గెలవదని చెబితే ఏమైనా వర్కవుట్ అవుతుందేమో అని ఓ పుచ్చు ఐడియాను అమలు చేస్తున్నారు. జనం ఎక్కువగా తచ్చాడే కూడళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రైళ్లల్లో కొన్ని గుంపులను పంపిస్తున్నారు చంద్రబాబు. ఈ గుంపుల పని ఏంటంటే.. మేం వైఎస్ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలమే కానీ.. ఈ సారి మా పార్టీ ఓడిపోయేలా ఉంది" అని ప్రచారం చేస్తున్నారు. అంటే మౌత్ టాక్ పబ్లిసిటీ అన్నమాట. దీనికి గానూ ఈ గుంపులకు రోజుకింత అని కిరాయి ముట్టజెబుతున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచులను ఆరు బయట పెయిడ్ ఆర్టిస్టులను మేపినట్లే..ఈ మౌత్ టాక్ మల్లిగాళ్లను ఎన్నికల వరకు మేపాలని డిసైడ్ అయ్యారు. పీకే ఫ్యామిలీపై విషం చిమ్మినోళ్లే.. జనం రద్దీగా ఉండే చోట వీళ్లు అమాంతం వచ్చి.. వాళ్లే మాటలు కలిపి ఈ సారి వైఎస్సార్సీపీ రాదండి అనేసి ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ చచ్చు ఐడియా కూడా వర్కవుట్ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ గుంపుల్లో ఉండే వారంతా పచ్చ కార్యకర్తలే. గతంలో ఇటువంటి కార్యకర్తలే పవన్ కల్యాణ్ కుటుంబంపైనా విషం చిమ్మారు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కష్టం వచ్చినా మల్లిగాళ్లను పిలిపించి ఇటువంటి అసైన్ మెంట్లు ఇప్పిస్తారు చంద్రబాబు. మౌత్ టాక్‌తోనే పాలక పక్షాన్ని దెబ్బతీయాలన్న పిచ్చి ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. అసలింతకీ ఈ అయిడియా రావడానికి కారణాలేంటి? చంద్రబాబు అంతగా ఓటమి భయంతో కుంగిపోడానికి కారణాలు ఉన్నాయి. జనం తమ వైపు లేరు. విజయం తమ వైపు లేదు. అధికారం తమకు దక్కేలా లేదు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీయార్ నాటి పూర్వ వైభవం వచ్చేలా లేదు. చంద్రబాబు, లోకేష్ లు సభలు పెడితే జనం కనపడ్డం లేదు. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి మీరు సిద్ధమా అని సభలు పెడితే ఇసకేస్తే రాలని జనంతో నేల కనపడ్డం లేదు. ఈ రెండు దృశ్యాల మధ్య తేడా చూసి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా అధిపతులకు కళ్లు బైర్లు కమ్మి కళ్లముందు ఏమీ కనపడ్డం లేదు. తమ ఓటమి ఖాయమని స్థానిక ఎన్నికల్లో కుప్పంలో కూడా తమ పార్టీ కుప్పకూలిన రోజునే చంద్రబాబుకు అర్ధం అయిపోయింది. పార్టీయే కాదు తన సొంత నియోజక వర్గంలో తనకు కూడా ఓటమి తప్పదన్న భయం చంద్రబాబు గుండెల్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయింది. గుణపాఠం తప్పదా? పేరుకి ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. కాలం కలిసొచ్చినపుడు..తమ పెంపుడు మీడియా తమకి బాకా ఊదిన రోజుల్లో ఢిల్లీలో చక్రాలు తిప్పామని చెప్పించుకున్న చంద్రబాబు ఇపుడు ఏపీలో కాదు తన సొంత నియోజక వర్గంలోనే సైకిల్ చక్రాన్ని కూడా తిప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నారు. అది సరిపోదని బిజెపి నేతలు ఛీ ఛీ అంటోన్న కాళ్లబేరాలాడి పొత్తు పెట్టుకున్నారు. తాము ముగ్గురం కలిసి బరిలో దిగినా ఒరిగేదేమీ లేదని తేలడంతో కాంగ్రెస్ తో రహస్య పొత్తు పెట్టుకున్నారు. వేణ్నీళ్లకు చన్నీళ్ల సాయం ఉండాలని 2014 నుంచి ఏపీలో ఏ ఎన్నికలోనూ బోణీ కొట్టని కమ్యూనిస్టులతో సీక్రెట్ డీల్స్ పెట్టుకున్నారు. అయినా వర్కవుట్ అయ్యే లా లేదని.. స్వయం ప్రకటిత మేథావులను తీసుకొచ్చి వారికి ఓ దుకాణం తెరిచి ఆ దుకాణం తరపున పాలకపక్షంపై విషం చిమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఆ దుకాణం తరపునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడానికి వీల్లేకుండా అడ్డంకులు సృష్టించారు. మండు టెండల్లో అవ్వా తాతలను మంచాలపై తీసుకెళ్లి పింఛన్లు ఇప్పించుకుంటోన్న దృశ్యాలు చూసి యావత్ ఆంధ్ర ప్రదేశ్ ... చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లతో పాటు వలంటీర్లపై ఫిర్యాదు చేయించి పింఛనుదార్ల పొట్ట కొట్టించిన నిమ్మగడ్డ రమేష్ పై నిప్పులు చెరుగుతున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లోనే విపక్ష కూటమికి గూబ గుయ్యిమనేలా గుణపాఠం చెబుతామని అంటున్నారు. దిక్కుమాలిన ఐడియాలు రక రకాల సర్వేలు ఏపీలో YSRCP అఖండ విజయం ఖాయమని తేల్చాయి. చంద్రబాబు నాయుడు సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ అదే తేలింది. రెక్కలు ముక్కలు చేసుకుని.. సిగ్గు లజ్జ వదిలేసి బిజెపి నేతల కాళ్లు పట్టుకుని పొత్తులు పెట్టుకున్నా తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేలడంతో చంద్రబాబుకు చలి జ్వరం వచ్చేసినట్లయ్యింది. ఏం చేయాలో పాలుపలోలేదు. ఎల్లో మీడియా ఇచ్చిన చచ్చు సలహాతో వాలంటీర్ల పై ఆంక్షలు విధిస్తే ఇపుడు 66 లక్షల మంది పింఛను దార్లు తనపై పీకలదాకా కోపంతో ఉన్నారని తెలిసి చంద్రబాబుకు నవ రంధ్రాల్లోంచి భయం కారిపోతోంది. అయితే కొద్ది మంది మనసుల్లో అయినా విషం చిమ్మితే ఆ మేరకు అయినా వైఎస్సార్సీపీ ఓట్లకు గండి కొట్టచ్చన్న చిల్లర ఐడియాతో చంద్రబాబు ఉన్నారు. అయితే ఇటువంటి దిక్కుమాలిన ఐడియాలు పేద ప్రజల తెలివితేటల ముందు ఎందుకూ పనికిరావంటున్నారు రాజకీయ పండితులు. అయితే ప్రస్తుతం ఏపీలో మెజారిటీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. అయిదేళ్లుగా తమ ఖాతాల్లో నేరుగా జమ అయిన సంక్షేమ పథకాల నిధులు తమ ఇళ్లల్లో తెచ్చిన వెలుగులను తమ జీవితాల్లో తెచ్చిన మార్పులను వారు మర్చిపోలేదు. తమ జీవితాలు ఇలానే హాయిగా కొనసాగాలంటే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వమే మరోసారి కొలువు తీరాలంటున్నారు. మేమంతా సిద్ధం బస్సుయాత్ర లో దారి పొడవునా లక్షలాదిగా తరలి వచ్చిన పేదలు ఈ విషయాన్నే ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు వచ్చిన స్పందన చూసిన తర్వాత కూటమి నేతలకు ముచ్చెమటలు పట్టాయి. ఆ తర్వాత ఆయన బస్సుయాత్ర ఆరంభించగానే రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీస్తోన్న భీకర వేడి వాతావరణంలోనూ ఆరేళ్ల కుర్రాడి నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు అన్ని వయసులకు చెందిన అన్ని వర్గాల ప్రజలు మరోసారి జగన్ మోహన్ రెడ్డినే సిఎంని చేసుకోడానికి తామంతా సిద్ధం సిద్ధం అంటున్నారు. చంద్రబాబు నాయుడి తరపున పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు తిరిగినట్లు.. వైఎస్సార్సీపీ విజయంపై దుష్ప్రచారం చేసే ముఠాలు ఎక్కడైనా కనిపిస్తే జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు పాలక పక్ష నేతలు. -
నారా లోకేష్ పాదయాత్ర పై సర్వత్రా విమర్శలు
-
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలా.. వద్దా?
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయితే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా.. వద్దా అనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఢిల్లీలో ఇంటింటికీ 'మై బీ కేజ్రీవాల్' సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది. స్థానిక మంత్రి గోపాల్ రాయ్ తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. "ఈ రోజు మొదటి రోజు. లక్ష్మీ నగర్ నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించాం. ప్రజలతో మాట్లాడాం. సీఎం కేజ్రీవాల్ ప్రజల కోసం చాలా పని చేశారని వారు చెప్పారు. ఉచితంగా కరెంటు, మంచినీరు, వైద్యం, విద్య, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్రలు వంటి సౌకర్యాలు కల్పించారని, అందుకే రాజీనామా చేయకుండా జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు గట్టిగా అభిప్రాయపడ్డారు" అని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ గత నెలలో విచారణకు పిలిచింది. అయితే కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరుకాలేదు. ఇది "చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితం" అంటూ నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. మేం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి అరెస్టు జరిగితే కేజ్రీవాల్ రాజీనామా చేయాలా లేక జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలా అనే విషయాన్ని ప్రజలనే అడిగాం’ అని రాయ్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి 20వ తేదీ వరకు మొత్తం 2600 పోలింగ్ స్టేషన్లలో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తామని, డిసెంబర్ 21 నుంచి 24 వరకు మొత్తం 250 వార్డుల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని రాయ్ తెలిపారు. ఏం చేయాలన్నది అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారన్నారు. -
జగనన్నే మా భవిష్యత్ ప్రోగ్రాం ఎట్ విజయవాడ
-
జగనన్నవల్లే నా భర్త ప్రాణాలు కాపాడుకోగలిగాను
-
అధ్వాన్నంగా ఆత్మకూరు - జూరాల ప్రాజెక్ట్ రహదారి
-
మోదీ విమానానికి పాక్ ఓకే
న్యూఢిల్లీ: అన్ని మంత్రిత్వ శాఖలు వచ్చే అయిదేళ్లలో ప్రజాభీష్టం మేరకు వారి జీవితాలను మెరుగుపరిచే ప్రభావవంతమైన ప్రణాళికలను రూపొందించాలని ప్రధాని మోదీ ఉన్నతాధికారులను కోరారు. సోమవారం ఆయన అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రభావశీల ప్రణాళికతో ముందుకు వస్తే వందరోజుల్లోనే అమలయ్యేలా అనుమతులు మంజూరు చేస్తాం’ అని ప్రధాని అధికారులను కోరారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ‘దేశంలో పని చేయగలిగే వారి సంఖ్య ఎక్కువగా మంది ఉన్నందున వారిని సమర్థంగా వాడుకోవాలి. కేంద్రంలోని ప్రతి శాఖ, రాష్ట్రంలోని ప్రతి జిల్లా కూడా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా మార్చేందుకు కీలకమైనవి. ఎంతో కీలకమైన ‘భారత్‌లో తయారీ’ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి. చిన్న వ్యాపారాలు, సంస్థల విషయంలో సులభతర వాణిజ్య విధానం ప్రతిఫలించాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల కార్యదర్శులు పరిపాలనపరమైన నిర్ణయాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీ, విద్యారంగ సంస్కరణలు, ఆరోగ్యం, పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి తదితర అంశాల్లో కొన్ని సూచనలు, సలహాలు చేశారు. 2014లోనూ ఇఏదేవిధంగా కార్యదర్శుల స్థాయి అధికారులతో మోదీ సమావేశమ య్యారు. మోదీ విమానానికి పాక్ ఓకే కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో జూన్ 13–14 తేదీల్లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)కు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ విమానానికి గగనతల అనుమతులు ఇవ్వాలన్న భారత్ విజ్ఞప్తికి పాకిస్తాన్ సానుకూలంగా స్పందించింది. తమ దేశం మీదుగా మోదీ విమానం కిర్గిజిస్తాన్ వెళ్లేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అంగీకరించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వవర్గాలు తెలిపాయి. బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద స్థావరంపై ఐఏఎఫ్ ఈ ఏడాది ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టడంతో పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని మొత్తం 11 రూట్లకుగానూ రెండు మార్గాల్లోనే రాకపోకల్ని అనుమతిస్తోంది. కాగా, జీ7 సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేసిన విజ్ఞప్తికి మోదీ అంగీకరించారు. ఫ్రాన్స్‌లోని బియర్రిట్జ్‌లో ఆగస్టు 24 నుంచి 26 వరకూ జరిగే 45వ జీ7 సదస్సుకు హాజరుకావాలని నిర్ణయించారు. -
ఉచిత మెట్రో ప్రయాణాన్ని సమర్థిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: మెట్రో రైళ్లు, డీటీసీ, క్లస్టర్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని కల్పించే ప్రతిపాదనపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ 1,000 జనసభలు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, పార్టీ మహిళా విభాగం కార్యవర్గసభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశాల ద్వారా సేకరించిన అభిప్రాయాలు, పార్టీ నిర్వహించే సర్వేల ఆధారంగా వారం ఆఖరున సమగ్ర ఫీడ్‌బ్యాక్ నివేదిక రూపొందిస్తారు. చదవండి: ఢిల్లీ మహిళలకు శుభవార్త ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మహిళా విబాగం సభ్యులు తమ తమ ప్రాంతాలలో జనసభలు జరిపి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తారు. ఈ వారం రోజులలో 1,000 జనసభలు జరుపుతారు. ప్రతి ఎమ్మెల్యే, కౌన్సిలర్, మహిళా విభాగం సభ్యులకు పదేసి జనసభలు నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. పార్టీ కార్యకర్తలు తమ తమ ప్రాంతాలలో నివసించేవారితో మాట్లాడి నోట్స్ రూపొందిస్తారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సమర్థిస్తున్నారా, సమర్థిస్తున్నట్లయితే ఎందుకు అని పార్టీ కార్యకర్తలు ప్రజలను ప్రశ్నిస్తారు. ఈ పథకంపై బీజేపీ వ్యతిరేకతను అంగీకరిస్తారా అని కూడా ప్రశ్నిస్తారు. అంగీకరిస్తామని సమాధానమిచ్చేవారిని ఎందుకు అంగీకరిస్తున్నారని కూడా ప్రశ్నిస్తారు. -
ఆంధ్రా ప్యారిస్‌లో.. అందరిదీ అదేమాట
సాక్షి, అమరావతి : రాజకీయ చైతన్య వీచిక తెనాలి మార్పును ఆకాంక్షిస్తోంది. గత ఐదేళ్ల పాలన చేదు అనుభవాలను నెమరవేసేవారు కొందరైతే.. గ్రాఫిక్స్, ఇంద్రజాలం తప్ప అభివృద్ధి, సంక్షేమం కరువైన దైన్య స్థితిని గుర్తుచేస్తున్నవారు మరికొందరు. మాయామాటలతో మూలన పడేసిన హామీలకు కొత్త రంగు పులిమి అనుభవం ఉన్న నేతనంటూ కాళ్ల బేరానికొచ్చినా నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఓటుకు నోట్లిచ్చినా... గుడ్డిగా అనుకరించేవాళ్లు్ల కనిపించడం లేదు. హక్కును అమ్ముకునే అవసరమేంటనేది స్థానికుల ప్రశ్న. ప్రతి ఇంటికి నవరత్నాలు చేరితే ఏటా రూ.లక్షల ప్రయోజనం ఉంటుందంటూ వారంతా చెబుతున్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో ‘సాక్షి’ బృందం జరిపిన రోడ్ షోలో ప్రజాభిప్రాయం వెల్లడైంది. నేతల నామినేషన్లతో తెనాలిలో పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. సాగునీటి శాఖ కార్యాలయం దాటి కాస్త ముందుకెళ్తే శీతల పానీయాలు ఆస్వాదిస్తూ కొందరు చర్చించుకుంటున్నారు. వారి ప్రధాన టాపిక్ వైఎస్సార్ సీపీ నవరత్నాలే. ‘చంద్రబాబు పథకాలెక్కడా? జగన్ నవరత్నాలెక్కడా? ఎన్నికల ముందు అదిగో ఇదిగో అంటూ చంద్రబాబు మాయ చేస్తున్నాడు. అర్థం కావట్లేదా?’ అనే హబీబుల్లా మాటలతో చర్చ కాస్త సీరియస్‌గా మారింది. ‘ఐదేళ్ల క్రితం అందరినీ నమ్మించాడు. ఇప్పుడూ అదే చేయాలనుకుంటున్నాడు. ఈసారి గ్రాఫిక్స్‌తో ముందుకొస్తున్నాడు. ప్రజలు దీన్ని గుర్తించాలి’ విశ్వనాథ్ మాటల్లో ఆవేశం కన్పించింది. ‘చదువుకున్నాళ్లే జనాన్ని చైతన్యం చెయ్యాలి’ ఆ పక్కనే చెరుకు రసం గ్లాస్ చేతుల్లోకి తీసుకున్న రమణ అన్నాడు. నవరత్నాల్లో లేని అంశమే లేదు. రైతులు, విద్యార్థులు, పేదలు, ఆరోగ్య శ్రీ ఒకటేంటి అన్నీ అందరికీ ఉపయోగపడేవే. జనంలోకి తీసుకెళ్లాలి’ అన్నాడు కొత్తగా ఓటొచ్చిన మల్లికార్జున ప్రసాద్. అక్కడకు వచ్చేవాళ్లు వస్తున్నారు... పొయ్యేవాళ్లు పోతున్నారు. చర్చ కొనసాగుతూనే ఉంది. ఐదేళ్ల మోసానికి ఓటే దీటైన జవాబు తెనాలి మండలం కొలకలూరులో ప్రజలను కదిలిస్తే చాలు మండిపడుతున్నారు. ఈ ఐదేళ్లు మోసపోయామన్న ఆవేదన వాళ్లలో కన్పిస్తోంది. తోటి మహిళలతో కోసూరు స్వప్న సాగించిన సంభాషణలో ఆ వాడివేడి తెలిసింది. ఒక్క నిమిషం అక్కడ ఆగితే... స్వప్నతో మరికొందరు మహిళలు గొంతు కలిపారు. ‘తెలుగు దేశపాయన నిన్న మా ఇంటికి వచ్చిండు వదినా.. వాళ్లంట పథకాలిత్తనారట. ఏదీ ఒక్కటైనా వచ్చిందా? సిగ్గు లేకుండా చెప్పుకొంటున్నారు. ఏం జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తేంటి?’ అంటూ ఈశ్వరమ్మ స్వరం కాస్త గట్టిగానే పలికింది. ‘ఔను మా ఇంటికీ వచ్చారు. డబ్బులిస్తామన్నారు. ఏం చూసి ఓటేయాలని మా పిల్లలు అడిగితే సమాధానం లేదు’ రుక్మిణమ్మ తన ఇంట్లో విషయాలు చెప్పుకొచ్చింది. స్వప్న కాస్త అడ్వాన్స్డ్గా తన అభిప్రాయం బయటపెట్టింది. సుపరిపాలన ఇచ్చే వాళ్లకే ఓటెయ్యాలంది. జగన్ ఉండబట్టే ఆ పథకాలు... సమయం సాయంత్రం నాలుగవుతోంది. కొల్లిపర మండలం అత్తోట మెయిన్ రోడ్డులో ఓ తోపుడు బండి. వృద్ధులంతా చెట్టు కింద పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. తోపుడు బండి మీద వేడివేడి ఇడ్లీలు తినేవరకు రోజూ ఆ చర్చ ఇలాగే సాగుతుందట. ‘ఇదేంటి ఈ టైంలో టిఫినా...?’ అంటే అదంతే అన్నారు. ‘జగన్ నవరత్నాలు ప్రకటించాకే కదా చంద్రబాబు పథకాలు నెత్తికెత్తుకున్నాడు’ అని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు గనిపిశెట్టి సాంబశివరావు. ‘జగన్ ఉండబట్టే ఈ ఐదేళ్లు చంద్రబాబు కాస్త వళ్లు దగ్గరపెట్టుకున్నాడు. జగన్ అంటే ఏంటో జనానికి తెలిసింది. మార్పు కోరుకుంటున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. జనసేన కుల ప్రభావాన్ని నమ్ముకుంది’ అన్నాడు రామశేఖరయ్య. ‘ఇడ్లీ రెడీ’ అని తోపుడు బండి అతను చెప్పేవరకు ఆ చర్చ రాజకీయాల చుట్టూ సాగుతూనే ఉంది. ఇవే కాదు... చెట్ల దగ్గర, చేలల్లో... రచ్చబండల వద్ద ఇలాంటి మాటామంతీలే! -
బాగా పరిశీలించాకే నిర్ణయం
న్యూఢిల్లీ: భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377కు సంబంధించి చట్టబద్ధమైన ప్రామాణికతను అన్ని రకాలుగా పరిశీలించాకే రద్దుపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. భారత్‌లో స్వలింగ సంపర్కులపై తీవ్ర వివక్షకారణంగా అది వారి మానసిక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపిందని అభిప్రాయపడింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొనే 158 ఏళ్ల నాటి సెక్షన్ 377ను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ధర్మాసనం సెక్షన్ 377 రద్దుపై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తమకే వదిలేసినప్పటికీ రాజ్యాంగపరంగా అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా సెక్షన్ 377ను కొనసాగించాలని, దీనిపై ప్రజాభిప్రాయం సేకరించాలని న్యాయవాదులు చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని దానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనేది చూడాలని అభిప్రాయపడింది. కేంద్రం యూ టర్న్ తీసుకుందనడం సబబు కాదు కేంద్రం ఈ కేసులో ‘యూ టర్న్’ తీసుకుందన్న న్యాయవాదుల ఆరోపణను, వారి వ్యతిరేకతను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అయితే గోప్యతా హక్కుతో పాటు పలు తీర్పులను పరిగణనలోకి తీసుకుని చూస్తే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ‘యూ టర్న్’గా అభివర్ణించడం సబబు కాదని పేర్కొంది. -
బాహుబలి-2 ప్రజాభిప్రాయం
-
ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
ఆలేరు : ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను జనగామ రెవెన్యూ డివిజన్లో కలపాలని నిర్ణయించడం సరైందికాదని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు దొంతిరి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆలేరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనగామలో కలిసేందుకు ఈ మూడు మండలాల ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఆలేరు నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉందని, ఆలేరు ముక్కలు చెక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై ఉందన్నారు. ఈ విషయమై ప్రభుత్వం తన నిర్ణయాన్ని తీసుకోకుంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు. అలాగే ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించేందుకు అన్ని అర్హతలున్నాయన్నారు. ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలన్నారు. ఈసమావేశంలో తునికి దశరధ, పులిపలుపుల మహేష్, పసుపునూరి వీరేశం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, పగడాల రాంబాబు, మైదం భాస్కర్, అల్వాల సిద్దులు, దయ్యాల సంపత్, పత్తి రాములు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలు
నాయకులు, ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని కాదు పేదల ఎజెండాగా పని చేస్తున్న ప్రభుత్వం మాది ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హన్మకొండ : ప్రజాభిప్రాయం, ప్రాసెస్ పూర్తయితేనే కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పష్ట త వస్తుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శా ఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హన్మకొండలోని టీఆర్ఎస్ అర్బన్ కార్యాల యంలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ల ఏర్పాటు నాయకులు, ఎమ్మెల్యేల కోసం కాదని, ప్రజల అభీష్టం మేరకే ఉంటుందని స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో వచ్చిన స్పందనపై సీఎం కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకుంటారని, ప్రజల కోరిక మేరకే జిల్లాలుంటాయని అన్నా రు. జిల్లాలు ఏర్పాటుకు అనుగుణంగా కేం ద్రం నియోజకవర్గాల పునర్విభజన చేస్తుందని ఆశిస్తున్నామని, లేదంటే 2029 వరకు ఈ నియోజకవర్గాలే ఉంటాయని అన్నారు. ఏ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే అధిష్టానమని అన్నారు. నామినేటెడ్ పదవుల్లో రాష్ట్ర స్థాయి చైర్మన్లను మాత్రమే కేసీఆర్ నియమిస్తారని, డైరెక్టర్లు, దేవాలయాల చైర్మన్ల ఎంపిక ఎమ్మెల్యేలదేనని చెప్పారు. చేతలతో సమాధానం ఆనాడు హేళన చేసిన నాయకులకు నేడు చేతల ద్వారా సమాధానం చెపుతున్నామని ఈటల అన్నారు. గులాబీ జెండా ఎత్తిన వారు ఇతర పార్టీల్లోకి వెళ్లలేదని, ఆనాడు వెకిలి మాటలు మాట్లాడిన పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున వచ్చారని గుర్తు చేశారు. ఏ ఆశయం కోసం తెలంగాణ సాధించామో, ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నామని అన్నారు. పేదల ఎజెండాతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన తనకు అందరి మనోభావాలు తెలుసని, ప్రభుత్వం చేపట్టనున్న నామినేటెడ్ పదవుల్లో కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని అన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నవారే అసలైన నాయకులని అన్నారు. అనంతరం మంత్రి ఈటలను సన్మానించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు గుడిమల్ల రవికుమార్, మర్రి యాదవరెడ్డి, కె.వాసుదేవరెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావు, మాడిశెట్టి శివశంకర్, నయీముద్దీన్, జకార్య, నారాయణ, రాజేంద్రకుమార్, డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, కార్పొరేటర్లు విజయ్‌భాస్కర్, మిర్యాల్‌కార్ దేవేందర్, వి.రవీందర్, టి. విద్యాసాగర్, జోరిక రమేష్, డిన్నా, నల్ల స్వ రూపరాణి, మాధవి, మిడిదొడ్డి స్వప్న, అరు ణ, సాబియా సబాహత్ పాల్గొన్నారు. -
ఎకరా రూ.10కోట్లు అయితే లక్షల్లో లెక్కలు!
కృష్ణా జిల్లా విజయవాడ మైట్రో రైల్ డిపో భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారిపోయింది. ప్రజాభిప్రాయ సేకరణలో అసలు విషయాలు బయటకొస్తున్నాయి. అధికారుల తీరును నిడమనురు రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. వాస్తవానికి మార్కెట్లో తమ భూమి ధర ఎకరా రూ.10 కోట్లుండగా, కేవలం 66 లక్షల రూపాయలుగా ఎలా నిర్ధారిస్తారని ఆ ప్రాంతాల రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. రైతులు ఎదురు తిరగడంతో అధికారులకు ఏం చేయాలో తోచడం లేదు. మెట్రో రైల్ డిపోకు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు బహిరంగంగానే చెబుతున్నారు. -
మమ!
పేరుకే ‘మెదక్ జిల్లా’.. నాడు రెవెన్యూ డివిజన్లో 18 మండలాలు నేడు జిల్లా రూపమిచ్చినా.. 14 మండలాలే! జిల్లాల పునర్విభజనలో మెదక్‌కు అన్యాయం ఒకే ఒక్క నియోజకవర్గంతో సరిపెట్టారు! ఇతర జిల్లాల్లోకి సమీప మండలాలు ఇదీ మెదక్ జిల్లా స్వరూపం మెదక్ జిల్లాలో ఆయా నియోజకవర్గాల నుంచి కలిసిన మండలాల వివరాలిలా ఉన్నాయి. మెదక్: మెదక్, పాపన్నపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట (ఇదొక్కటే మెదక్ జిల్లాలోని మండలాలతో ఉన్న నియోజకవర్గం) నర్సాపూర్: కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం, శివ్వంపేట గజ్వేల్: తూప్రాన్ దుబ్బాక: చేగుంట నారాయణఖేడ్: పెద్దశంకరంపేట, రేగోడ్ ఆందోలు: టేక్మాల్, అల్లాదుర్గం మెదక్:ప్రజాభీష్టం మేరకే జిల్లాలను ఏర్పాటు చేస్తామన్న పాలకులు.. ఇష్టారీతిన జిల్లాను విభజించి మెదక్‌ను 14 మండలాలకే పరిమితం చేశారు. 18 మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మెదక్‌ను.. జిల్లాగా చేసి 14 మండలాలే మిగల్చడంపై ఈ ప్రాంత వాసుల్లో ఆవేదనను కలిగిస్తోంది. సంగారెడ్డి నూతన జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా, సిద్దిపేటకు నాలుగు పూర్తిస్థాయి నియోజకవర్గాలున్నాయి. మెదక్ జిల్లాలో మాత్రం కేవలం ఒకేఒక్క పూర్తిస్థాయినియోజకవర్గం ఉండగా, మిగతా నియోజకవర్గాల నుంచి పది మండలాలను వేరుచేసి మెదక్‌లో కలిపారు. ఈ విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రం నుంచి మండలాలకు ఉండే దూరాన్ని ప్రామాణికంగా తీసుకొని..విభజన చేయాల్సి ఉండగా మెదక్ విషయంలో అది జరగలేదన్న విమర్శలున్నాయి. మెదక్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న నాగిరెడ్డిపేట, నర్సాపూర్, నారాయణఖేడ్ మండలాలను మెదక్‌లో కలిపేందుకు అవకాశమున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. జిల్లా కేంద్రం కోసం పోరాటం ఒకప్పుడు మెదక్ నాలుగు జిల్లాలకు సుభాగా ఉండేదని, ఇక్కడి నుంచే పాలన కొనసాగేదని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలో నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక జిల్లా కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. చివరకు ఒకే నియోజకవర్గంతో కూడిన జిల్లా ఏ ర్పాటు కావడంపై వారంతా ఆవేదన చెందుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జి ల్లా ఒకచోట, జిల్లా కేంద్రం మరోచోట ఉం దంటే అది ఒక్క మెదక్‌లోనే! దీంతో ఈ ప్రాం తం అన్ని రంగాల్లో వెనకబాటుకు గురైంది. నాటి పాలకులు జిల్లా కేంద్రాన్ని సంగారెడ్డికి తరలించి, హైదరాబాద్‌లో ఉంటూ పాలన కొనసాగించారు. కాగా, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్న సమయంలోనూ ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక జిల్లా కోసం ఆందోళనలు నిర్వహించారు. జిల్లాకు అన్యాయం ఒక నియోజకవర్గంతో పాటు 10 మండలాలను కలిపి మెదక్ కొత్త జిల్లా ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు అతి సమీపంలో ఉన్న మండలాలను సైతం పరిగణలోకి తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. మెదక్ మండలంలో 35 గ్రామ పంచాయతీలు, 12 మధిర గ్రామాలు, 21 గిరిజన తండాలున్నాయి. మెదక్ డివిజన్‌లోనే ఇది అతిపెద్ద మండలం. కాగా, జిల్లా విభజన ప్రారంభం కాగానే మెదక్ మండలంలోని హవేళిఘణాపూర్ను మండలకేంద్రంగా ప్రకటిస్తారని ఈ ప్రాంత ప్రజలు భావించారు. అదీ జరగలేదు. అంతేకాకుండా నర్సాపూర్ నియోజకవర్గాన్ని మెదక్ జిల్లాలోనే ఉంచాలని, అక్కడి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సైతం కోరుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండల ప్రజలు సైతం తమ మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి నర్సాపూర్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటు నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్‌లో కలిపితేనే ఈ ప్రాంతానికి ఒక భౌగోళిక స్వరూపం వస్తుంది. ప్రయోజనం శూన్యం 14 మండలాలతో మెదక్‌ను జిల్లాగా ఏర్పాటు చేయడమంటే ఈ ప్రాంత ప్రజలను అవమాన పర్చినట్టే. ఎలాంటి అభివృద్ధి వనరులు ఈ 14 మండలాల్లో లేవు. మెదక్ జిల్లాలో నర్సాపూర్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటు నాగిరెడ్డిపేట మండలాలన్ని కలపాల్సిన అవసరం ఉంది. – హర్కార్ మహిపాల్, మ్యాప్స్ అధ్యక్షుడు, మెదక్ అశాస్త్రీయ ఏర్పాటు మెదక్ జిల్లా ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలను ఆయా జిల్లాల్లోనే ఉంచుతామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అదీ అమలు కాలేదు. శాస్త్రీయ ప్రకారమే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. – అస్త్రగల్ల బాలరాజ్, ఎంవైఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ -
ప్రజాభిప్రాయం మేరకే మార్పులు చేయాలి
ప్రొఫెసర్ కోదండరాం ♦ జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి ♦ త్వరలో అన్ని జిల్లాల్లో సదస్సులు హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాభిప్రాయం మేరకే మార్పులు చేయాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగిందని భావించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం నాచారంలో ‘తెలంగాణ - అభివృద్ధి నమూనా - టీజేఏసీ ఆలోచన’ అనే అంశంపై జరిగిన సదస్సుకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మార్పులు అవసరమే కాని.. అవి ప్రజాభిప్రాయం మేరకే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో ఈ అంశంపై అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సదస్సులో తెలంగాణ అభివృద్ధి నమూనాపై రిటైర్డ్ ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, నీటి వనరుల వినియోగం అంశంపై బొజ్జ భిక్షం, కృష్ణా జలాల వినియోగంపై ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి, సాగునీటి వ్యవస్థపై కె.రఘు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉపాధి, ఉద్యోగరంగాలు అనే అంశంపై గిరిజాల రవీందర్, జోనల్ వ్యవస్థ రద్దు అనే అంశంపై సురేశ్ మాట్లాడారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ, ప్రభుత్వం అభివృద్ధి పేరుతో నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోందని, అయితే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం తగ్గించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం కలిగేలా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. జోనల్ వ్యవస్థ రద్దు అనే అంశంపై విస్తృత చర్చ జరగాలని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగం, జిల్లాల పునర్విభజన, ఉద్యోగ అవకాశాలపై విస్తృత జర్చ జరిపామని అన్నారు. గత ఏడాది పంటలు ఎండిపోయి నష్ట పోయిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని, ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు నష్టపోయారని, వారిని ఆదుకోవడానికి, కరువు పరిస్థితులను అంచనా వేయడానికి ప్రభుత్వం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు. కృష్ణా జలాల వినియోగంపై మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సదస్సులో జేఏసీ నాయకులు పిట్టల రవీందర్, కె.రఘు, ప్రహ్లాద్, వెంకట్‌రెడ్డి, జి.రవీందర్, ప్రొఫెసర్ పురుషోత్తం, ఇతర నేతలు ముత్తయ్య, రమేశ్, వీఎస్ మల్లికార్జున్, ఖాజా మోయినుద్దీన్, ప్రభాకర్‌రెడ్డి, రామకృష్ణ, చల్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, డాక్టర్ పాపారావు, ప్రకాశ్, విజయ్‌కుమార్, బాబన్న, వెంకటేశ్, ధర్మరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి
శాయంపేట : శాయంపేట మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారని వైఎస్సార్ సీపీ మండల ప్రధాన కార్యదర్శి మారపల్లి సుధాకర్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు. శాయంపేటకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూపాలపల్లిలో కలపకుండా వరంగల్ జిల్లాలోనే కొనసాగించేలా స్పీకర్, భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి చొరవ తీసుకోవాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఒక్కసారి మండలాన్ని భూపాలపల్లిలో కలిపితే జీవితాంతం మండల ప్రజలు బాధపడుతారన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా వారి అభిప్రాయం మేరకు మండలాన్ని వరంగల్ జిల్లాలో కొనసాగించేలా స్పీకర్ బహిరంగ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మారపల్లి సుదర్శన్, అల్లె అర్జున్ పాల్గొన్నారు. -
కొంచెం ఇష్టం కొంచెం కష్టం
తెలంగాణ @ ఏడాది ఆరు దశాబ్ధాల పాటు తెలంగాణ ప్రజలు పరాయి పాలనలో అష్టకష్టాలు పడ్డారు. భూమిపై, వనరులపై హక్కు కోల్పోయి బానిస బతుకులు బతికారు. ఈ క్రమంలో ‘మనమంతా ఏకమవుదాం. మన రాష్ట్రం మనం సాధించుకుందామంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు.., వేలు, లక్షల ప్రజల్లో ఆశ రేపింది. ఒక్కొక్కరు వేలు, లక్షలై కదిలారు. అనుకున్నది సాధించుకున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అమలు నోచుకో లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కేసీఆర్ పాలన ‘కొంచెం ఇష్టం...కొంచెం కష్టం’గా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. - నిజామాబాద్ అర్బన్ ♦ కేసీఆర్ ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయం ♦ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ♦ వేడుకలకు సన్నద్ధమైన ప్రభుత్వ యంత్రాంగం ♦ హామీలు అమలు అంతంతే నైరాశ్యంలో ప్రజలు రుణమాఫీపై కొర్రీలు భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కేసీఆర్ మొదట రైతుల రుణ మాఫీ అంశంపై నెల రోజుల పాటు తర్జన భర్జన పడ్డారు. ఎట్టకేలకు రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన రైతులకు సంబంధించిన 1786 కోట్ల 96 లక్షల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యూయి. ఇంతవరకు బాగానే ఉన్నా తొలి విడతగా 25 శాతం మాత్రమే రుణాలు మాఫీ చేశారు. దీంతో జిల్లాకు 446 కోట్ల 74 లక్షలను ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. వీటిలో సరైన ఆధారాలు చూపిన 3 లక్షల 98 వేల మంది రైతులకు 401 కోట్ల 30 లక్షల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశారు. దీంతో చిన్న చిన్న లోపాలు ఉన్న రైతు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా రుణమాఫీ డబ్బులు మొత్తం చెల్లించకపోవడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇచ్చేందుకు రైతును ఇబ్బందికి గురిచేస్తున్నారు. పాత రుణం తీర్చితేనే కొత్త రుణం అని నిక్కచ్చిగా చెబుతున్నట్టు రైతులు వాపోతున్నారు. మిగిలిన రుణమాఫీ సొమ్మును త్వరలో రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించినా, ఇప్పటి వరకు జమచేయలేకపోయూరు. కల్యాణ లక్ష్మి, షాదీ ‘ముబారక్’ సమాజంలో ఆడపిల్ల అంటేనే భారంగా భావించే తల్లిదండ్రులకు గొప్ప వరంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు. ఆడపిల్లల పెళ్లి చేయూలంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కుటుంబాల కోసం ప్రభుత్వం ఈ పథకాలను రూపొందించింది. పెళ్లి సమయంలో వీరికి రూ. 51 వేలు అందజే స్తారు. ఇందులో భాగంగా జిల్లా నుంచి 96 దరఖాస్తులు రాగా, 61 మందికి 51 వేల రూపాయల చొప్పున 31 లక్షల 11 వేలు మంజూరు చేశారు. ఇంకా 35 పరిశీలనలో ఉన్నాయి. షాదీ ముబారక్‌లో 244 దరఖాస్తులు రాగా, 30 మందికి 51 వేల రూపాయల చొప్పున 15 లక్షల 30 వేలు మంజూరు చేశారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పథకం అమలుకు అధికారులు కాస్త చొరవ చూపుతున్నట్టు లబ్ధిదారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే స్పందించి పెళ్లి సమయూనికి డబ్బులు అందేలా కృషి చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. మిషన్ కాకతీయ కాకతీయుల కాలం నాటి చెరువులు ఆంధ్ర పాలకుల పాలనలో నిరాధరణకు గురయ్యూరుు. వీటికి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు ‘మిషన్ కాకతీయ’ను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. జిల్లాలో 3251 చెరువులు ఉన్నాయి. వీటిలో మొదటి దశలో 20 శాతం చెరువుల్లో పునరుద్దరణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, చెరువులు సర్వే చేసి దశల వారీగా ప్రభుత్వం అనుమతి పంపడానికే నెలల కొద్దీ సమయం పట్టింది. పరిపాలన అనుమతి ఇవ్వడంలోనూ జాప్యం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 661 చెరువులకు మాత్రమే అనుమతి లభించింది. వీటిలో 519 చెరువుల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన 142 చెరువుల పనులు ఇంకా ప్రారంభించలేదు. ఇలా అయితే వేల సంఖ్య లో ఉన్న చెరువులు పూర్తవ్వాలంటే మరో ఐదేళ్ల సమయం కావాల్సిందే అని పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఆసరా పింఛన్ల గోస గత ఏడాది నవంబర్‌లో ఆసరా పింఛన్ పథకం ప్రారంభించారు. పథకం ప్రారంభానికి ముందు చేపట్టిన సకల జనుల సమ్మెతో చాలా మంది పింఛన్ దారులను అనర్హులుగా గుర్తించారు. అర్హులకే పింఛన్ వర్తించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లు గీత కార్మికులు మొత్తం 3 లక్షల 86 వేల 544 మందికి నెలకు వెయ్యి చొప్పున పింఛన్లు పింఛన్లు, వికలాంగులకు నెలకు రూ. 1500 చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా పింఛన్ రాని వారు అన్ని అర్హతలు కలిగి ఉంటే విచారణ చేపట్టి మంజూరు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. వీరితో పాటు బీడీ కార్మికుల కోసం జీవన భృతి పింఛన్ పథకం ప్రవేశపెట్టారు. ఇందులో 2,70,633 మంది బీడీ కార్మికులు ఉండగా, 1,14,208 మంది జీవన భృతి పొందుతున్నారు. అయితే, వీరికి పింఛన్ మంజూరు చేయడానికి సవాలక్ష ఆంక్షలు పెట్టడంతో చాలా మందిని అనర్హులుగా గుర్తించారు. ఈ అంశంపై చాలా చోట్ల నిరసనలు, ధర్నాలు నేటికీ కొనసాగుతున్నారుు. అధికారులు మాత్రం దరఖాస్తు చేసుకుంటే అర్హులకు పింఛన్ మంజూరు చేస్తామని హామీ ఇస్తున్నారు. నల్లా నీళ్లొచ్చేనా..? ప్రతి ఇంటికి నల్లా’ హామీలు పకడ్బంధీగా అమలు చేసేందుకు ‘వాటర్‌గ్రిడ్’ను పనులు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి జిల్లాను రెండు సెగ్మెంట్లుగా విభజించారు. ఒక సెగ్మెంట్‌కు సింగూర్ జలాశయం నుంచి 16 మండలాలకు రూ. 1710 కోట్ల అంచనా వ్యయంతో , రెండో సెగ్మెంట్‌కు శ్రీరాంసాగర్ జలాశయం నుండి 20 మండలాలకు రూ.1765 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం సర్వే పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత తీర్చేందుకు పనులు ప్రారంభించారు. అదేవిధంగా పట్టణ తాగునీటి సరఫరా ద్వారా నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్ పట్టణంలో తాగునీరు సదుపాయాల గురించి 4 పనులను రూ. 232 కోట్ల 47 లక్షల వ్యయం తో చేపట్టగా నిజామాబాద్ పట్టణానికి సం బంధించిన పనులు పూర్తయ్యూయి. ఈ పథకం అమలుకు కేసీఆర్ తీవ్ర కృషి చేస్తున్నారు. ఒకానొక దశలో ఇంటింటికి నల్లా ఇవ్వకుంటే వచ్చే ఎన్నికలో ఓటు అడుగను అని నిక్కచ్చిగా చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే సాధారణ ఎన్నికల్లోపు ఇంటింటికి నల్లా వచ్చేలా ఉందని పలు గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భూమి ఎప్పుడిత్తరో..! భూమి లేని నిరుపేద దళితులకు వ్యవసాయూధారిత మూడెకరాల భూమి పంపిణీ చేయూలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భూమిని కొనుగోలు చేసేందుకు సమాయత్తమైంది. పంపిణీ చేసిన భూమిలో బోరు, మోటారు, కరెంటు కనెక్షన్ లాంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వమే సమకూరుస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా మొదటి ఏడాది పెట్టుబడి కూడా ప్రభుత్వమే పెడుతుందని, సదరు భూముల్లో భూసార పరీక్షలు, భూగర్భ జల పరీక్షలు జరుపుతామని అధికారులు పేర్కొన్నారు. కానీ, ఇప్పటి వరకు జిల్లాలో 16 మందికి మాత్రమే 48 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. అర్హులైన వారు ఎంతో మంది ఉన్నా వారిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యూరనే ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆవిర్భావ వేడుకల్లోనైనా అర్హులైన దళితులను గుర్తించి వారికి భూమి పంపిణీ చేయూలని పలువురు దళిత నేతలు కోరుతున్నారు. కేసీఆర్ ప్రధాన హామీలు:- ⇒ రైతుల రుణాలు మాఫీ ⇒ వృద్ధులు, వికలాంగుల పింఛన్ పెంపు ⇒ బీడీ కార్మికులకూ పింఛన్ ⇒ ఇంటింటికి నల్లా ⇒ పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ⇒ కేజీ టు పీజీ ఉచిత విద్య ⇒ దళితులకు మూడెకరాల భూమి -
జనహితం.. సాక్షి అభిమతం
‘ప్రజాభ్యుదయమే ధ్యేయంగా ఆవిర్భవించిన ‘సాక్షి’ దినపత్రిక నేటితో ఏడు వసంతాలు పూర్తి చేసుకుంది. ఎనిమిదో వసంతంలోకి అడుగిడింది. ప్రజాభిప్రాయానికి పట్టం కడుతూ, నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ, అక్రమాలపై అక్షర సమరం సాగిస్తోంది. నీతిమాలిన రాజకీయాలను కడిగిపారేస్తూ అక్షర ప్రస్థానాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. తద్వారా అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ ప్రజల మనస్సాక్షిగా విరాజిల్లుతోంది. ప్రజల కష్టనష్టాల్లో వెన్నంటి నిలుస్తూ వారి ఆత్మీయ‘సాక్షి’గా నిలుస్తోంది. పని చేయని అధికారులను వెలేత్తిచూపుతూ పని చేయిస్తోంది. కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ఊతకర్రలా నిలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప : ప్రభుత్వ పథకాల అమలులో చోటు చేసుకుంటున్న జాప్యాన్ని, అర్హు ల పొట్ట కొడుతూ అనర్హులకు పెద్దపీట వేస్తున్న వైనాన్ని నిలదీస్తూ అర్హులకు పక్కా న్యాయం జరిగేందుకు ‘సాక్షి’ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ‘హాస్పిటల్ విజిట్’ పేరుతో జిల్లాలోని పీహెచ్‌సీల పనితీరును వేలెత్తి చూపింది. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌లో ప్రజలు విన్నవించుకున్న సమస్యలు పరిష్కారం కాని వైనాన్ని తెలియజేస్తూ.. బాధితుల ఆవేదనకు అక్షర రూపం ఇస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పాట్లను ‘ఫోకస్’ చేస్తూ పరిస్థితిలో మార్పు తేవడానికి కృషి చేస్తోంది. ఇదే తరుణంలో బాగా పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తూ స్ఫూర్తిదాయక కథనాలు ప్రచురిస్తోంది. మహిళలకు అండగా.. ఇంట్లో మహిళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే ఆ కుటుంబం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ఈ దిశగా మహిళలను ప్రోత్సహిస్తూ ఎన్నో స్ఫూర్తిదాయక కథనాలు ప్రచురిస్తోంది. మహిళల కష్టనష్టాలు, విజయగాధలు, జీవనపోరాటాలను ఆవిష్కరిస్తోంది. ‘నా కూతురే నా జీవితం’ శీర్షిక ద్వారా భర్తలను కోల్పోయిన మహిళలు తమ బిడ్డల భవిత కోసం తపిస్తున్న వైనాన్ని కళ్లకు కట్టింది. ఎందరో మహిళలు తమ కూతుళ్లను టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇతర ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దిన వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. ఎన్నెన్నో సమస్యలకు పరిష్కారాలు.. ప్రజా అవసరాలను క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు గుర్తించి, వారికి తగిన సమాచారాన్ని కమ్యూనిటీ పేజీల రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ప్రచురితమైన కథనాల వల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరిగింది. అనేక సమస్యలు పరిష్కారమయ్యా యి. ‘అటెన్షన్ ప్లీజ్’ శీర్షిక కింద ప్రచురితమైన అనేక ఫొటో కథనాలకు అధికారులు స్పందించి.. వెంటనే పరిష్కార మార్గం చూపారు. ప్రజల వద్దకే అధికారులను తీసుకొచ్చి, వారి సమస్యలను వినేలా ‘సాక్షి’ నిర్వహించిన బృహత్తర కార్యక్రమం ‘జన సభలు’. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జనసభలు నిర్వహించింది. వీటికి పురపాలక, విద్యుత్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులను ఆహ్వానించింది. ప్రజలు తమ సమస్యలను నేరుగా, అర్జీల రూపంలో అందించేందుకు తోడ్పడింది. వాటిని పరి శీలించిన అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. పలుచోట్ల అక్కడికక్కడే పలు సమస్యలు పరిష్కారమయ్యాయి. ‘సాక్షి’ ఫోకస్ శీర్షికన చాలా అంశాలను, సమస్యలను వెలుగులోకి తెచ్చింది. చాలా సమస్యలను పరిష్కరించాల్సిన అవశ్యకతను అధికారులకు తెలియజెపుతూ ప్రభుత్వ వైఫల్యాన్నీ ఎండగట్టింది. నిరక్షరాస్యులకు విద్యాబుద్ధులు నేర్పిన ‘అక్షర సాక్షి’ నిరక్షరాస్యత అభివృద్ధికి అవరోధం. ఈ విషయాన్ని గుర్తించిన ‘సాక్షి’ గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకుంది. ‘అక్షరసాక్షి’ పేరుతో సాక్షరతా ఉద్యమాన్ని చేపట్టింది. ఇందుకోసం నియమించిన కో ఆర్డినేటర్.. పల్లె పల్లె తిరుగుతూ... చదువు లేకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులు, చదువుకుంటే కలిగే లాభాలను మహిళలకు వివరించారు. దీంతో వందలాది మంది నిరక్షరాస్య మహిళల్లో చదువుపై ఆసక్తి కల్గింది. చాలా మంది దినపత్రికలు చదివే స్థాయికి ఎదిగేలా కృషి చేసింది. వ్యవ‘సాయం’ జిల్లా రైతన్నలకు ‘సాక్షి’ ప్రతి నిత్యం చేదోడువాదోడుగా నిలుస్తోంది. ఈ అక్షరసత్యాన్ని జి ల్లాలో ఏ మారుమూల గ్రామానికి చెందిన రైతు ను అడిగినా ఇట్టే చెబుతాడు. ఖరీఫ్, రబీ సీజన్లకు అనుగుణంగా ఎప్పుడు ఏ పంట సాగు చేసుకోవాలి.. పాటించాల్సిన జాగ్రత్తలు.. ఇతరత్రా యాజమాన్య పద్ధతుల గురించి అర్థమయ్యే రీతిలో ‘పాడిపంట’ ద్వారా వివరిస్తోంది. పంటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్లు, వాటి నివారణ పద్ధతులను పేరెన్నికగన్న శాస్త్రవేత్తలు, అధికారుల సాయంతో రైతులకు తెలియజేస్తోంది. భూసార పరీక్షల ప్రాముఖ్యత గురించి వివరించి.. రైతుల్లో చైతన్యా న్ని రగిల్చింది. అవసరానికి మించి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పింది. సేంద్రియ ఎరువుల వాడకం దిశగా రైతులను ప్రోత్సహించింది. అక్షర యజ్ఞం ద్వారా వ్యవ‘సాయాన్ని’ నేటికీ కొనసాగిస్తూనే ఉంది. ‘సాక్షి‘ చొరవ.. పరిశోధక సీట్ల పెంపు - వైవీయూ చరిత్రలోనే గొప్ప మలుపు యోగివేమన విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థుల ప్రవేశపరీక్ష -2011లో జరిగిన అవినీతి, అక్రమాలను ‘ఇష్టారాజ్యం’ పేరుతో 2012 జనవరి 23న సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. ప్రవేశాల్లో చోటు చేసుకున్న అక్రమాలు, రిజర్వేషన్ ప్రక్రియలో లోపాలు, సాక్షాధారాలతో ప్రచురించింది. దీంతో విద్యార్థి లోకం వైవీయూ చరిత్రలో ఎన్నడూలేని విధంగా తీవ్ర స్థాయిలో ఉద్యమ బాట పట్టింది. వైవీయూ వైస్ చాన్స్‌లర్, అధ్యాపక బందం కలిసి చర్చించి అప్పటి వరకు ఉన్న 100 సీట్లతో పాటు అదనంగా మరో 100 సీట్లు అర్హులైన వారికి కేటాయించారు. ఈ సంఘటన వైవీయూ చరిత్రలో పెనుమార్పులకు కేంద్ర బిందువైంది. -
మమ్మల్ని పట్టించుకోండి
‘భూములు, ఇళ్లు, ఆస్తులు అన్నీ అప్పగించినం. కానీ, ఉపాధి సమయంలో మమ్మల్ని విస్మరిస్తున్నరు. సింగరేణిలో, ఎన్టీపీసీలో ఇలాగే చేశారు. ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు మేం వ్యతిరేకం కాదు. కానీ, మాకు ఉపాధి కల్పించండి... మా గ్రామాల్లో వసతులు కల్పించండి’ అని ఆర్ఎఫ్సీఎల్ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు తేల్చిచెప్పారు. బుధవారం జేసీ పౌసుమి బసు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కొన్ని నిరసనలు, పోలీసు బందోబస్తు మధ్య సాఫీగానే సాగింది. - గోదావరిఖని గోదావరిఖని : ‘ప్రాజెక్టు కోసం భూములు, ఆస్తులు ఇస్తే తర్వాత విస్మరిస్తున్నారు... కర్మాగారం ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు.. ఉపాధి, ఉద్యోగావకాశాలు స్థానికులకే కల్పించండి’ అంటూ ఎఫ్‌సీఐ ప్రభావిత గ్రామాల ప్రజలు అభిప్రాయపడ్డారు. రామగుండం ఎరువుల కర్మాగారం(ఎఫ్‌సీఐ) పునరుద్ధరణపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు అధ్యక్షతన ఎఫ్‌సీఐ టౌన్షిప్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు, కాంట్రాక్టు కార్మికులు పలు దఫాలు నిరసన తెలపగా, చివరకు పోలీసు బందోబస్తు మధ్య కార్యక్రమం సజావుగా ముగిసింది. గ్యాస్ ఆధారితంగా నూతనంగా ‘రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)’ పునరుద్ధరిస్తున్న విషయం తెలిసిందే. కర్మాగారం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, చుట్టుపక్కల గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. గతంలో పర్యావరణపరంగా చర్యలు సరిగ్గా తీసుకోకపోవడంతో దిగువ ప్రాంతం ల క్ష్మీపురంలోని బావులు, చెరువులలో బూడిద చేరి నీరు కలుషితమైందన్నారు. ప్రస్తుతం అలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్టీపీసీ, సింగరేణికి గతంలో భూములు అప్పగిస్తే ఇప్పుడు ఉద్యోగాలు లేవంటున్నారని ఎఫ్‌సీఐ అలా చేయొద్దని కోరారు. ఎఫ్‌సీఐ కర్మాగారం గోడకు ఆనుకుని ఉన్న వీర్లపల్లిలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని, ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగతో అనారోగ్యంపాలవుతున్నామని గ్రామస్తులు ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. గ్రామాన్ని తీసుకుని వేరేచోట పునరావాసం కల్పించాలని కోరారు. గతంలో ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికుల వారసులకు అర్హతలను బట్టి ఉద్యోగావకాశాలు కల్పించాలని కాంట్రాక్టు కార్మికులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ 10 గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉన్న ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లోని రహదారిని మూసివేయొద్దని, అవసరమైతే ఆర్ఎఫ్సీఎల్ యూజమాన్యం గేట్ నిర్మించుకోవాలని సూచించారు. స్థానిక నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, మాజీ కార్మికులకు వైద్య సౌకర్యాలు, వారి పిల్లలలో పనిచేసే వీలున్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అనంతరం జేసీ పౌసుమి బసు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవిదాస్ మాట్లాడుతూ ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంపై ప్రజలు అభిప్రాయూలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపించనున్నట్లు ప్రకటించారు. ఆర్ఎఫ్సీఎల్ సీఈవో వివేక్ మల్హోత్రా, ఎఫ్‌సీఐ ఇన్చార్జి జీఎం సీత, మల్లేశ్వరి, రాజ్‌కుమార్, పెద్దపల్లి ఆర్డీవో నారాయణరెడ్డి, తహశీల్దార్ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీపీ ఆడెపు రాజేశం, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం, మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బాబర్ సలీంపాషా, వీఎస్ఎస్ సంఘం ప్రధాన కార్యదర్శి జీఎన్ రావు, ఎం.సుందర్రాజు, కంది శ్రీనివాస్, బొర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
హామీలతో ఆమోద ముద్ర
సాక్షి, విజయవాడ, ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : స్థానికుల తీవ్ర నిరసనను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్టీటీపీఎస్ తన పంతం నెగ్గించుకొంది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో నూతనంగా నిర్మించబోయే 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రంపై శుక్రవారం భారీ పోలీసు బలగాల మధ్య కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయసేకరణ జరిపి ఆమోదముద్ర వేయించుకోగలిగారు. ఇబ్రహీంపట్నంలోని థర్మల్ కేంద్రం గ్రౌండ్లో ఉదయం 11.30కి ప్రజాభిప్రాయ సదస్సు ప్రారంభమైంది. ఎన్టీటీపీఎస్ నుంచి వస్తున్న కాలుష్యం వల్ల బాధపడుతున్న 10 గ్రామాల ప్రజలు ‘రాజకీయ పార్టీల ఐక్యకార్యాచరణ వేదిక’గా ఏర్పడి ప్రజాభిప్రాయసేకరణలో తీవ్ర నిరసన తెలిపారు. వేదిక ముందే బైఠాయించి ఎన్టీటీపీఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్టీటీపీఎస్ డౌన్‌డౌన్, మాకొద్దు ఈ ప్రాజెక్టు.. అంటూ నినాదాలు చేశారు. ఎన్టీటీపీఎస్లో మరో కొత్త ప్లాంట్ ఏర్పాటుచేసి తమ జీవితాలను బుగ్గి చేయొద్దని మహిళలు డిమాండ్ చేశారు. ఒక దశలో స్థానికులతో అధికారులు మినిట్స్ పుస్తకాల్లో సంతకాలు పెట్టించి సమావేశాన్ని మొక్కుబడిగా ముగించేందుకు చేసిన యత్నాలను ప్రజలు తిప్పికొట్టారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే సభ రసాభాసగా మారింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. సభాస్థలి వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని స్థానికుల్ని శాంతింపజేశారు. ఒకదశలో పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన ఏపీ జెన్కో అధికారులు ప్రజల డిమాండ్లను అంగీకరిస్తూ లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో సభ ప్రశాంతంగా ముగిసింది. సమావేశంలో ఏపీ జెన్కో మేనేజింగ్ డెరైక్టర్ విజయానంద్, జెన్కో డెరైక్టర్ సి.రాధాకష్ణ, వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీఎల్ శాస్త్రి, కలెక్టర్ రఘునందన్‌రావు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, సబ్ కలెక్టర్ హరిచందన, ఎన్టీటీపీఎస్ సీఈ సమ్మయ్య, ఎంపీడీవో లక్ష్మీకుమారి, తహశీల్దారు ఎం.మాధురి, వ్యవసాయ అధికారి లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు : జోగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించిన తర్వాతే ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలంటూ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ సదస్సులో పట్టుబట్టారు. లక్షా 50వేల మంది ప్రజలున్న ఇబ్రహీంపట్నం మండలంలో కేవలం 120 మంచినీటి కుళాయిలు వేశామని చెప్పడానికి అధికారులు సిగ్గుపడాలంటూ ఆయన ధ్వజమెత్తారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, తమతోను, తమ పిల్లల భవిష్యత్తుతోనూ ఆటలాడుకోవద్దని ఆయన సూచించారు. 20 అంశాలపై అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మేడపాటి నాగిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ అంక మోహనరావు, కాంగ్రెస్ నాయకులు అక్కల గాంధీ, ఆవుల సీతారామయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్, బీజేపీ నేత రేగళ్ల రఘునాథ్‌రెడ్డి, సీపీఐ నాయకుడు పి.తాతయ్య, ఇబ్రహీంపట్నం ప్రముఖులు మల్లెల పద్మనాభరావు, సర్పంచి అజ్మీర స్వర్ణ, కొండపల్లి సర్పంచి అమ్మాజీ, ఈలప్రోలు సర్పంచి మిరియాల చినరామయ్య, జూపూడి సర్పంచి నల్లమోతు దుర్గారావు, జి.ప్రసాద్, ఎ.విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ విలీనం గోల
=విలీన పంచాయతీలపై ప్రజాభిప్రాయ సేకరణ =గ్రామస్తుల నుంచి వ్యతిరేకత.. =రాజకీయ నాయకుల ఒత్తిడి =ఇరకాటంలో అధికారులు జీవీఎంసీలో పంచాయతీల విలీనం ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ప్రజాభిప్రాయం తీసుకొనే ఈ ప్రక్రియ చేపట్టాలంటూ కోర్టు ఆదేశించడంతో అధికారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంటే నిరసన వ్యక్తమవుతోంది. మరో వైపు తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలంటూ రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. దీంతో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయింది. సాక్షి, విశాఖపట్నం: ప్రజల నుంచి వ్యతిరేకత, రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు అధికారులను ఇరకాటంలో పెడుతున్నాయి. జీవీఎంసీలో పంచాయతీల విలీనం ప్రక్రియ మళ్లీ మొదటికి రావడంతో ఈ సమస్య ఎదురవుతోంది. తమ అభిప్రాయాన్ని తీసుకోకుండా ఏకపక్షంగా విలీనం చేయడమేంటని సంబంధిత గ్రామస్తులు కోర్టును ఆశ్రయించడంతో కథ మొదటికొచ్చిన విషయం తెలి సిందే. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేయడంతో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సోమవారం నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో స్థానిక అధికారులకు తలనొప్పి ప్రారంభమైంది. విలీనానికి అనుకూలంగా చర్యలు తీసుకోవాలని, తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని నేతలు ఒత్తిడి చేస్తున్నారు. మరో వైపు తమ అభిప్రాయాన్ని యథాతథంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విలీన గ్రామస్తులు గట్టిగా చెబుతున్నారు. మధ్యలో ఉన్న గ్రామాలను కలుపుకుంటే తప్ప అనకాపల్లి, భీమిలి మున్సిపాల్టీలను జీవీఎంసీలో విలీనం చేయలేరన్న నిబంధనతో ప్రభుత్వం ఆదరాబాదరగా పంచాయతీరాజ్ నుంచి డీనోటిఫై చేస్తూ పది గ్రామాల్ని ఏకపక్షంగా కలిపేసింది. ఇందులో పరవాడ మండలంలోని తాడి, సాలాపువానిపాలెం, అనకాపల్లి మండలంలోని వల్లూరు, రాజుపాలెం,కొప్పాక గ్రా మాలు, భీమిలి మండలంలోని కె.నగరంపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, జె.వి.అగ్రహారం గ్రామాలున్నాయి. ఈ గ్రామాల రికార్డుల్ని కూడా జీవీఎంసీ స్వాధీనం చేసుకుంది. సంబంధిత పంచాయతీ ఎన్నికల్ని పరోక్షంగా అడ్డుకుంది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భీమిలి మండలంలోని ఐదు గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. తమ అభిప్రాయం తెలుసుకోకుండా విలీ నం చేయడమేంటని ప్రశ్నించారు. దీంతో సంబంధిత గ్రామాల అభిప్రాయాల్ని తీసుకుని నిర్ణయం తీసుకోవాలని, స్వాధీనం చేసుకున్న పంచాయతీ రికార్డులను వెనక్కి ఇచ్చేయాలని జీవీఎంసీని హైకోర్టు ఆదేశించింది. భీమిలి మండల పంచాయతీలకు రికార్డులను వెనక్కి ఇచ్చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా మరో ఉత్తర్వు ఇచ్చింది. భీమిలి మండలంలోని పంచాయతీలతో పాటు పరవాడ, అనకాపల్లి పంచాయతీల్లో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సోమవారం నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. తొలుత భీమిలి మండలం కె.నగరంపాలెంలో గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి డి.వి.మల్ల్ఛ్చిర్జునరావు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి జీవీఎంసీలో ఎందుకు విలీనం చేయకూడదో అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా కోరారు. కానీ స్థానికులు తీవ్రంగా వ్యతి రేకించారు. ప్లకార్డులు ప్రదర్శించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీవీఎంసీలో విలీనమైతే పన్నులు పెరుగుతాయని, ఉపాధి పనుల్ని కోల్పోతామని కూడా ఆందోళన తెలియజేశారు. పంచాయతీల విలీనం వల్ల రియల్ ఎస్టేట్, బడాబాబులకే ప్రయోజనం తప్ప చేపలు పడితే గాని జీవనం సాగని తమలాంటి కుటుంబాలకు కాదని గ్రామస్తులందరూ ముక్తకంఠంతో చెప్పారు. ప్రజాభిప్రాయం ఇలా ఉంటే విలీనానికి అనుకూలంగా ఎలాగోలా తతంగాన్ని పూర్తి చేయాలంటూ మరోవైపు అధికారులపై నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇవన్నీ ముందే పసిగట్టిన విలీన ప్రతిపాదిత గ్రామాల నాయకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ మతలబు చేస్తారోనని గ్రామ సభ జరిగిన తీరును, ప్రజాభిప్రాయ సేకరణపై వీడియో కూడా తీస్తున్నారు. ఇరువర్గాల మధ్య అధికారులు నలిగిపోతున్నారు.