Published
Mon, Sep 12 2016 8:13 PM
| Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
ఆలేరు : ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను జనగామ రెవెన్యూ డివిజన్‌లో కలపాలని నిర్ణయించడం సరైందికాదని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు దొంతిరి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆలేరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనగామలో కలిసేందుకు ఈ మూడు మండలాల ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఆలేరు నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉందని, ఆలేరు ముక్కలు చెక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై ఉందన్నారు. ఈ విషయమై ప్రభుత్వం తన నిర్ణయాన్ని తీసుకోకుంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు. అలాగే ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించేందుకు అన్ని అర్హతలున్నాయన్నారు. ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలన్నారు. ఈసమావేశంలో తునికి దశరధ, పులిపలుపుల మహేష్, పసుపునూరి వీరేశం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, పగడాల రాంబాబు, మైదం భాస్కర్, అల్వాల సిద్దులు, దయ్యాల సంపత్, పత్తి రాములు తదితరులు పాల్గొన్నారు.