ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ | kcr cheating the people | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌

Published Tue, Oct 4 2016 10:19 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ - Sakshi

ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌

ఆలేరు : సీఎం కేసీఆర్‌ ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఆలేరులోని రైల్వేగేట్‌ వద్ద మంగళవారం చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనానరు. కొత్త జిల్లాల ఏర్పాటులో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలకు, సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాజకీయాలకు తావిస్తూ సీఎం కేసీఆర్‌ ఇష్టానుసరంగా జిల్లాలు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలను, అన్ని పార్టీలను భాగస్వామ్యులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు దొంతిరి శ్రీధర్‌రెడ్డి, నాయకులు కావటి సిద్ధిలింగం, పులిపలుపుల మహేష్, భోగ శ్రీను, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, అల్వాల సిద్ధులు, కుండె సంపత్, కూళ్ల సిద్ధులు, దయ్యాల సంపత్, బడుగు జహంగీర్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement