నరేంద్రమోదీ రెండేళ్ల పాలనలో సాధించింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది.
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ రెండేళ్ల పాలనలో సాధించింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. శాసన్ నో భాషన్ (శాసనాలు చేయడమే తప్ప మాట్లాడింది లేదని లేదు) తోనే సరిపెట్టారని ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కపిల్ సిబల్, గులామ్ నబీ ఆజాద్, మళ్లికార్జున ఖర్గే, రణదీప్ సూరజ్ వాలా లుబీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు..
కపిల్ సిబల్ మాట్లాడుతూ.. రెండేళ్ల కాలంలో ఏం సాధించారని వేడుకలు చేసుకుంటున్నారని , వ్యవసాయ ఉత్పత్తులపై 50 శాతం లాభాలు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. రెండేళ్లలో కిస్ కా సాత్ కహన్ హే వికాస్ (ఎవరితో అభివృద్ధి, ఎక్కడ అభివృద్ధి) జరిగిందని ఆయన చమత్కరించారు.. మోదీ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారని దేనికీ సమాదానం ఇవ్వరన్నారు.. గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. మోదీ అన్ని రంగాల్లో విఫలం అయ్యారని ఆరోపించారు..కేవలం హామీలు ఇవ్వడమే కానీ అమలు చేయడం లేదన్నారు. యూపీఏ ప్రభుత్వ పథకాలనే పేరు మార్చి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి దళితులు, విద్యర్థుల భయం పట్టుకుందని ఆయన ఎద్డేవా చేశారు.