indian foreign affairs
-
ఇతర దేశాలనూ గౌరవించండి
మ్యూనిచ్: తాము మాత్రమే ప్రజాస్వామ్య విలువల్ని పాటిస్తామని, మిగతా దేశాలకు వాటి గురించి కొత్తగా నేరి్పస్తున్నట్లు తరచూ హితబోధ చేసే పశ్చిమదేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గట్టి సమాధానమిచ్చారు. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో జరుగుతున్న భద్రతా సదస్సులో ‘‘ఓటేసేందుకు జీవించే ఉందాం: ప్రజాస్వామ్య సవాళ్లను ఎదుర్కొందాం’’అంశంపై బృందచర్చలో ఆయన ప్రసంగించారు. తమ దేశాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్లు పశ్చిమ దేశాలు భావిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా పశ్చిమదేశాల వైఖరిని ఖండిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని మీరు(పశ్చిమదేశాలు) నిజంగా భావిస్తే వివిధ దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ప్రజాస్వామ్య విధానాలను మీరూ ఆదరించాల్సిందే. కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలంటే పశ్చిమదేశాలు తమ దేశాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్లు మాట్లాడుతున్నాయి. గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రజాస్వామ్యేతర విధానాలను ఈ పశ్చిమదేశాలు రుద్దుతున్నాయి. పశ్చిమదేశాలు సొంత గడ్డపై ప్రజాస్వామ్యానికి ఎంత విలువ ఇస్తాయో గ్లోబల్ సౌత్ దేశాల ప్రజాస్వామ్యానికీ అంతే విలువ ఇవ్వాలి. ఇంటి విధానాలను బయటా ఆచరించి చూపండి’’అని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల్లోని విజయాలను గ్లోబల్ సౌత్ దేశాలూ అందిపుచ్చుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యం అన్నం పెడుతుంది ప్రజాస్వామ్యం అన్నం పెట్టదని సెనేటర్ ఎలిసా చేసిన వ్యాఖ్యలను జైశంకర్ పరోక్షంగా తప్పుబట్టారు. ‘‘మీరు చెప్పేది తప్పు. వాస్తవానికి ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఆహారాన్ని అందించగలదు. భారత ప్రజాస్వామ్య సమాజంలో ప్రజలకు మేం పౌష్టికాహారం అందిస్తున్నాం. 80 కోట్ల మందికి(రేషన్ ద్వారా) ఆహార భరోసా కల్పించాం. వాళ్లిప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ల కడుపులు నిండాయా లేదా అనేది ప్రధానం’’అని అన్నారు. భారత ప్రజాస్వామ్యంపై.. ‘‘ఇటీవలే నా సొంత రాష్ట్రం ఢిల్లీ(అసెంబ్లీ ఎన్నిక)లో ఓటేశా. నా వేలికి ఉన్న ఈ సిరా గుర్తు ఆ ఓటుదే. గత ఏడాది భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అర్హులైన ఓటర్లలో మూడింట రెండొంతుల మంది ఓటేశారు. అంటే 90 కోట్ల మందిలో ఏకంగా 70 కోట్ల మంది ఓటేశారు. ఇన్ని కోట్ల ఓట్లను మేం ఒకే రోజులో లెక్కించాం’’అని అన్నారు. ఈ చర్చలో జైశంకర్‌తోపాటు నార్వే ప్రధాని జొనాస్ గహర్ స్టోర్, అమెరికా సెనేట్ సభ్యురాలు ఎలిసా స్లోట్కిన్, వార్సా నగర మేయర్ రాఫల్ ట్రజస్కోవ్క్ పాల్గొన్నారు. -
కెనడాలో ‘ఆస్ట్రేలియా టుడే’పై నిషేధం
న్యూఢిల్లీ: భారతదేశం పట్ల వ్యతిరేకతను కెనడా ప్రభుత్వం బహిరంగంగా ప్రదర్శిస్తోంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నా లెక్కచేయడంలేదు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా మీడియా సంస్థ అయిన ‘ఆస్ట్రేలియా టుడే’పై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కెనడాలో ఆ సంస్థ ప్రసారాలు, వార్తలు ప్రజలకు అందకుండా బ్లాక్ చేసింది. అలాగే మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలపైనా నిషేధం విధించింది. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన జైశంకర్ మీడియా సమావేశాన్ని ప్రసారం చేయడమే ఇందుకు కారణం. కెనడా చర్యపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కెనడాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మీడియా స్వేచ్ఛను గౌరవిస్తున్నామని సుద్దులు చెప్పే కెనడా ప్రభుత్వం ఆచరణలో ఆందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భారత్‌పై కెనడా చేస్తున్న అసంబద్ధ ఆరోపణలను ఆస్ట్రేలియా గడ్డపై జైశంకర్ ఎండగట్టడాన్ని కెనడా ప్రభుత్వం సహించలేకపోతోందని ఆరోపించారు. -
S Jaishankar: వివాదాలకు చర్చలే శరణ్యం
కజన్: వివాదాలు, విభేదాలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిందేనని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పునరుద్ఘాటించారు. యుద్ధాలతో సాధించేదీ ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, ఉద్రిక్తతలు చల్లారాలంటే చర్చలపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచించారు. రష్యాలోని కజన్ నగరంలో బ్రిక్స్ ఔట్రీచ్/బ్రిక్స్ ప్లస్ సదస్సులో చివరి రోజు గురువారం జైశంకర్ మాట్లాడారు. ఇది యుద్ధాల శకం కాదంటూ భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. శాంతియుత చర్చలు, దౌత్య మార్గాలపై దృష్టి పెడితే వివాదాలు సమసిపోతాయని పేర్కొన్నారు. దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినప్పుడు వాటిని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు ఎవరైనా సరే లోబడి ఉండాలని, ఎలాంటి మినహాయింపులు ఉండొద్దని తేల్చిచెప్పారు. ప్రపంచానికి ముప్పుగా మారిన ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు. పశి్చమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. దీర్ఘకాలపు సవాళ్లను ఎదిరించే విషయంలో కొత్తగా ఆలోచించడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాల్సిందే ప్రపంచీకరణ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందడం లేదని, ఈ నిజాన్ని బ్రిక్స్ వేదిక గుర్తించాలని జైశంకర్ కోరారు. కోవిడ్ మహమ్మారితోపాటు వేర్వేరు సంఘర్షణల కారణంగా గ్లోబల్ సౌత్ దేశాలపై భారం మరింత పెరిగిందన్నారు. వైద్యం, ఆహారం, ఇంధన భద్రత విషయంలో ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సరిసమానమైన ప్రపంచ క్రమం’ అవసరమని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల విషయంలో వివిధ దేశాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని, ఇవి వలసవాద పాలన నుంచి వారసత్వంగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలను సరి చేయాలన్నారు. సరుకుల సరఫరా కోసం దేశాల మధ్య అనుసంధానం మరింత పెరగాలన్నారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని గౌరవిస్తూ ఆ దిశగా అన్ని దేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి సంస్థలు, అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణలు తక్షణావసరమని జైశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు వెంటనే ప్రారంభించాలని అన్నారు. భద్రతా మండలిలో మరికొన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం కలి్పంచాలని డిమాండ్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్∙సదస్సుకు పదికిపైగా బ్రిక్స్ సభ్యదేశాలతోపాటు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. -
యూఎస్‌పై భారత్ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేశవ్యాప్తంగా దళితులు, ముస్లింలపై దాడులు విపరీతంగా పెరిగాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ విడుదల చేసిన నివేదికను భారత ప్రభుత్వం ఖండించింది. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వంలో మైనార్టీల మత స్వేచ్ఛకు తీవ్ర భంగం ఏర్పడిందని అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ అనే స్థంస్థ తన నివేదనలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సంస్థ సర్వేపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా జీవిస్తున్నారని స్పష్టం చేసింది. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్న వార్తలను ఖండించింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ ప్రజలకు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా అశాంతి లేదని, దళితులు, మైనార్టీలకు తమ ప్రభుత్వంపై పూర్తి స్థాయి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. యూఎస్ రిపోర్టుపై పలువురు బీజేపీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ.. తన నివేదికలో పలు విషయాలను పొందుపరిచింది. హిందుమత వ్యాప్తి కోసం ఇతర మతాలపై హిందుత్వ సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని పేర్కొంది. దాడులను అరికట్టడంలో బీజేపీ విఫలం ముఖ్యంగా భారత రాజ్యాంగం దేశ ప్రజలకు, అన్ని మతాలకు ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా కొన్ని సంస్థలు వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మైనార్టీలపై దాడులకు అరికట్టడంలో తీవ్రంగా విఫలమైందని, మూక దాడుల పేరుతో ఓ వర్గాన్ని తీవ్రంగా హింసిస్తున్నారని నివేదికలో పేర్కొంది. దక్షిణ భారతదేశంతో పోలిస్తే.. ఉత్తరంలో మూకదాడులు విపరీతంగా పెరిగాయని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దాడులు ఎక్కువగా ఉన్నాయని ఇంటర్నేషనల్ రిలీజియన్ ప్రీడమ్ రిపోర్టు తెలిపింది. -
ముందస్తు పదవీ విరమణ కోరాను: సుజాతాసింగ్
న్యూఢిల్లీ: విదేశాంగ కార్యదర్శిగా తన పదవీ కాలం ముగియటానికి ముందుగానే పదవీ విరమణ కావాలని తాను కోరినట్లు సుజాతాసింగ్ పేర్కొన్నారు. వ్యవస్థ కన్నా ఏ వ్యక్తీ అధికం కాదని ఆమె వ్యాఖ్యానించారు. విదేశాంగ కార్యదర్శి పదవి నుంచి ప్రభుత్వం తనను అర్ధంతరంగా తొలగించిన నేపథ్యంలో.. సుజాతాసింగ్ తన సహ ఐఎఫ్ఎస్ అధికారులకు వీడ్కోలు ఈ-మెయిల్ సందేశం పంపించారు. ఇందులో తన తొలగింపు విషయాన్ని ఆమె ప్రస్తావించలేదు. అయితే.. 38 ఏళ్ల ప్రభుత్వ సర్వీసు తర్వాత తాను ముందస్తుగా పదవీ విరమణ కోరుకున్నానని పేర్కొన్నారు. సంస్థల నిర్మాణంలో వ్యక్తులు కీలక పాత్ర పోషించినప్పటికీ.. సంస్థలే కీలకమని.. సంస్థలు ఒక దానితో ఒకటి ఎలా సమన్వయం చేసుకుంటాయనేది ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖలో 38 ఏళ్ల పాటు పనిచేయటం తనకు లభించిన విశిష్ట అవకాశమని.. గత 18 నెలల పాటు విదేశాంగ కార్యదర్శిగా పనిచేయటం తనకు జీవితాంతం గర్వంగా గుర్తుండిపోతుందని చెప్పారు.