Australian media
-
కెనడాలో ‘ఆస్ట్రేలియా టుడే’పై నిషేధం
న్యూఢిల్లీ: భారతదేశం పట్ల వ్యతిరేకతను కెనడా ప్రభుత్వం బహిరంగంగా ప్రదర్శిస్తోంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నా లెక్కచేయడంలేదు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా మీడియా సంస్థ అయిన ‘ఆస్ట్రేలియా టుడే’పై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కెనడాలో ఆ సంస్థ ప్రసారాలు, వార్తలు ప్రజలకు అందకుండా బ్లాక్ చేసింది. అలాగే మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలపైనా నిషేధం విధించింది. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన జైశంకర్ మీడియా సమావేశాన్ని ప్రసారం చేయడమే ఇందుకు కారణం. కెనడా చర్యపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కెనడాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మీడియా స్వేచ్ఛను గౌరవిస్తున్నామని సుద్దులు చెప్పే కెనడా ప్రభుత్వం ఆచరణలో ఆందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భారత్‌పై కెనడా చేస్తున్న అసంబద్ధ ఆరోపణలను ఆస్ట్రేలియా గడ్డపై జైశంకర్ ఎండగట్టడాన్ని కెనడా ప్రభుత్వం సహించలేకపోతోందని ఆరోపించారు. -
ఇంగ్లండ్ గడ్డపై విరాట్ కోహ్లి ఫేవరేట్ షాట్
-
కోహ్లిపై దుమ్మెత్తిపోస్తున్న ఆసీస్ మీడియా
బర్మింగ్‌హామ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అతడి ఇమేజ్‌ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముందే ఇలా చేయడం చర్చనీయాంశమైంది. ఈ ప్రయత్నాలను భారత అభిమానులు తిప్పికొడుతున్నారు. ‘ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా’ తన ఫేస్బుక్ పేజీలో కోహ్లిపై ప్రత్యేకంగా రూపొందించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో గత ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి వైఫల్యాలను జతపరిచింది. అంతేకాకుండా ఈ వీడియోకు ‘ఇంగ్లండ్ గడ్డపై విరాట్ కోహ్లి ఫేవరేట్ షాట్’ అని సెటైరిక్ క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ గడ్డపై కోహ్లి సాధించిన సెంచరీలు మరిచిపోయారా? అంటూ చురకలంటిస్తున్నారు. ఇక కోహ్లిపై ఆసీస్ మీడియా విషం గక్కడం ఇదే తొలిసారేం కాదు.. భారత పర్యటనలో భాగంగా డక్‌వర్త్ లూయిస్ విషయంలో స్మిత్ చేసిన పొరపాటును కప్పిపుచ్చుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో కోహ్లిని పోల్చుతూ విమర్శలు గుప్పించింది. ఇక తమ దేశ ఆటగాళ్లను వెనుకేసుకు రావడంలో ఆసీస్ మీడియా ఎప్పుడు ముందే ఉంటుదన్న విషయం తెలిసిందే. 2014 ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 13.40 కాగా.. రెండు సార్లు డకౌట్ కూడా అయ్యాడు. ఈ సిరీస్ అనంతరం కోహ్లి నేలకు కొట్టిన బంతిలా విజృంభించాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుస సెంచరీలతో చెలరేగాడు.. ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై మొత్తం 8 మ్యాచ్‌లాడిన కోహ్లి 62 సగటుతో 992 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండటం విశేషం. అనంతరం దక్షిణాఫ్రికా గడ్డపై 5 మ్యాచుల్లో 55.80 సగటుతో 558 పరుగులు చేశాడు. ఈ పర్యటనలో రెండు సెంచరీలు నమోదు చేశాడు. న్యూజిలాండ్ గడ్డపై రెండు మ్యాచుల్లో ఓ సెంచరీతో 214 పరుగులు చేశాడు. ఇలా అన్ని దేశాల మీద రాణించిన కోహ్లికి ఇంగ్లండ్‌లో విఫలమవ్వడం వెలతిగా మిగిలిపోయింది. తన సారథ్యంలో నేటి నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే 5 టెస్టుల సిరీస్‌లో చెలరేగాలని కోహ్లి భావిస్తున్నాడు. ‘ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా’ షేర్ చేసిన వీడియో -
ఇది నిలువెల్లా మోసం
సిడ్నీ: సహజంగా తమ ఆటగాళ్లను బాగా వెనకేసుకొచ్చే ఆస్ట్రేలియా మీడియాకు కూడా బాల్ ట్యాంపరింగ్ ఘటన కంపరం పుట్టించినట్లుంది. దేశ జాతీయ క్రీడకు తీరని ద్రోహం, కుళ్లిన సంస్కృతి అంటూ స్థానిక ప్రసార మాధ్యమాలు ధ్వజమెత్తుతుండటమే దీనికి నిదర్శనం. ‘స్మిత్స్ షేమ్’ అంటూ మొదటి పేజీలో కథనం ఇచ్చిన ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక... ‘ఇది హెల్మెట్ నుంచి బూటు వరకు చేసిన నిలువెత్తు మోసం’గా అభివర్ణించింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తప్పుకోవాలని డిమాండ్ చేసింది. ‘రెండు దశాబ్దాలుగా సీఏను నడిపిస్తున్న సదర్లాండ్ జాతీయ జట్టు సంస్కృతిని మార్చలేకపోయారు. స్మిత్ చర్య పరిస్థితులరీత్యా చేసింది కాదని సిడ్నీ డైలీ టెలిగ్రాఫ్ పేర్కొనగా, ఈ ఉదంతం స్మిత్, జట్టు పేరు ప్రఖ్యాతులకు కోలుకోలేని దెబ్బని, తీవ్ర మూల్యం చెల్లించారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అభివర్ణించింది. పునరాలోచనలో జట్టు స్పాన్సర్లు... ట్యాంపరింగ్ ఆస్ట్రేలియా జట్టు స్పాన్సర్షిప్పైనా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. 600 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్ల టీవీ ప్రసార హక్కుల ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుంది. తాజా పరిణామాలతో స్పాన్సర్లు బేరానికి దిగనున్నట్లు తెలుస్తోంది. అతిపెద్ద స్పాన్సర్ అయిన మాజిలాన్ సంస్థ... ట్యాంపరింగ్‌ను తీవ్ర మోసంగా పేర్కొంది. ‘మేం చాలా అసంతృప్తికి గురయ్యాం. మా జాతీయ జట్టు నుంచి ఇలాంటిది ఆశించలేదు’ అని ఎయిర్‌లైన్ క్వాంటాస్ స్పష్టం చేసింది. ఈ సంస్థ పేరున్న జెర్సీనే ప్రస్తుత సిరీస్‌లో ఆటగాళ్లు ధరిస్తున్నారు. ఆ దేశ మహిళా జట్టు స్పాన్సర్ అయిన కామన్వెల్త్ బ్యాంక్ కూడా దీనిపై సీఏ నుంచి వివరణ కోరింది. -
'కోహ్లీకి అహం, అతనో ఉన్మాది'
సిడ్నీ: ఆస్ట్రేలియా మీడియా బుధవారం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు చేసింది. విరాట్ కోహ్లీ 'క్లాస్ లెస్' ఆటగాడని.. అతను చిన్నపిల్లాడికంటే దారుణంగా ప్రవర్తిస్తాడని పేర్కొంది. నాలుగో టెస్టు విజయం తర్వాత కోహ్లీ మాట్లాడిన తీరు వల్ల అతన్ని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇక ముందెన్నడూ స్నేహితుడిగా చూడరని చెప్పింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అజింక్యా రహానేను బీర్ పార్టీకి పిలిచినప్పుడు వెళ్లకపోవడంపై దుమ్మెత్తిపోసింది. ఆఖరి టెస్టు ముగిసిన తర్వాత ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా కోహ్లీ తన చిన్నపిల్లాడి మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నాడని డైలీ టెలీగ్రాఫ్ అనే పత్రిక పేర్కొంది. కోహ్లీ ఓ ఉన్మాది అని కూడా వ్యాఖ్యానించింది. మురళీ విజయ్‌పై అనవసరంగా నోరు పారేసుకున్న స్టీవ్ స్మిత్ క్షమాపణలు కోరాడని.. కోహ్లీ కూడా ఆస్ట్రేలియన్ క్రికెటర్లకు క్షమాపణ చెప్పాలని హెరాల్డ్ సన్ అనే పత్రిక డిమాండ్ చేసింది. కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఆస్ట్రేలియా మీడియా విరాట్‌పై పలుమార్లు నోరు పారేసుకుంది. విరాట్‌పై వస్తున్న విమర్శలు మంచివి కావని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ హితవు పలికినా ఆస్ట్రేలియా పత్రికల నోరు మూతపడలేదు. -
కోహ్లి గొప్ప నాయకుడు
ఆసీస్ మాజీ ఆటగాళ్ల ప్రశంసలు మెల్బోర్న్: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై కక్ష కట్టిన ఆస్ట్రేలియా మీడియా తమ అసత్య కథనాలతో విమర్శిస్తున్నా ఆ దేశ మాజీ క్రికెటర్లు మాత్రం అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మైకేల్ క్లార్క్ ఇప్పటికే తన మద్దతు ప్రకటించగా తాజాగా దిగ్గజ ఆటగాళ్లు స్టీవ్ వా, ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా ఇదే బాటలో పయనించారు. ‘కోహ్లి అద్భుత నాయకుడు. తనతోపాటుగా జట్టును, దేశాన్ని నడిపిస్తున్నాడు. ధర్మశాలలో తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తాడేమోనని భయంగా ఉంది. ప్రస్తుత వివాదాన్ని ఇరు జట్లు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. 2008 మంకీగేట్లా ఇది కాకూడదనే అనుకుంటున్నాను. 2001 అనంతరం జరుగుతున్న అద్భుత సిరీస్ ఇదేనని చాలామంది చెబుతున్నారు’ అని గిల్లీ తెలిపారు. మరోవైపు కోహ్లి కెప్టెన్సీలో తనతోపాటు రికీ పాంటింగ్ లక్షణాలు కనిపిస్తున్నాయని మాజీ కెప్టెన్ స్టీవ్ వా కొనియాడారు. ‘భారత క్రికెట్‌కు అతడు కొత్త ముఖచిత్రం. దూకుడైన కెప్టెన్‌గా చెప్పవచ్చు. జట్టు ఆటగాళ్లతో నిరంతం సంభాషిస్తూ ముందుకెళతాడు. సానుకూల దృక్పథంలో నన్ను గుర్తు చేస్తున్నాడు. పాంటింగ్లోనూ ఇలాంటి లక్షణాలే కనిపించేవి’ అని వా అన్నారు. -
సూపర్ స్టార్ సూపర్ పంచ్!
-
కోహ్లి ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తోంది
న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై దుమ్మెత్తిపోస్తున్న ఆస్ట్రేలియా మీడియాపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ధ్వజమెత్తారు. కోహ్లి గురించి చెత్త రాతలు రాస్తోందని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోహ్లికి సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కోహ్లిని పోల్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎవరో ఇద్దరు ముగ్గురు ఆసీస్ జర్నలిస్టులు అతడి ఇమేజ్‌ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని, దీన్ని కోహ్లి పట్టించుకోవాల్సిన అవసరం లేదని సలహా ఇచ్చారు. ‘ట్రంప్‌తో కోహ్లిని పోల్చడం చాలా చెత్తగా ఉంది. కోహ్లి అంటే నాకే కాదు ఆసీస్ దేశస్తులకు కూడా చాలా ఇష్టం. సవాళ్లను స్వీకరించే అతడి తత్వం ఆదర్శనీయం. ఇద్దరు ముగ్గురు ఆసీస్ జర్నలిస్టులు అతడి గౌరవాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. వారి గురించి తను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు ఆసీస్ మీడియా చెబుతున్న విషయాలను స్మిత్ కూడా పట్టించుకోవడం లేదు. ధర్మశాలలో జరిగే చివరి టెస్టుపై దృష్టి సారించి సిరీస్ దక్కించుకోవాలనే ఇరు జట్ల కెప్టెన్లు తమ ఆటగాళ్లకు చెబుతున్నారు’ అని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో క్లార్క్ వివరించారు. విరాట్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయని, క్రీజులోకి వచ్చిన ప్రతిసారీ అతడి నుంచి అభిమానులు సెంచరీలు ఆశిస్తారని తెలిపారు. అయితే అతడి తాజా ఫామ్ లేమి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధర్మశాలలో భారీ స్కోరు చేసి సిరీస్ గెలిపించే అవకాశం ఉందని చెప్పారు. అలాగే ఇరు జట్ల బౌలర్లు తీవ్రంగా అలసిపోయారని, దీంతో టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకుని వారికి తగిన విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా తన ఆటోబయోగ్రఫీ ‘మై స్టోరీ’ని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, పరిపాలన కమిటీ చీఫ్ వినోద్ రాయ్‌లకు క్లార్క్ అందజేశారు. -
సూపర్ స్టార్ సూపర్ పంచ్!
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో స్పందించారు. ‘మిస్టర్ ఫైర్’ గురించి వాస్తవాలు ఒప్పుకున్నందుకు ఆసీస్ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ‘క్రీడల్లో విరాట్ కోహ్లి డొనాల్డ్ ట్రంప్ వంటి వాడని ఆసీస్ మీడియా పోల్చింది. కోహ్లి విజయుడని, ప్రెసిడెంట్ అని ఒప్పుకున్నందుకు ఆస్ట్రేలియా మీడియా ధన్యవాదాల’ని అమితాబ్ ట్వీట్ చేశారు. తాను రెండు చేతులతో నమస్కరిస్తున్న ఫొటో కూడా ట్విటర్ లో పోస్టు చేశారు. భారత్ లో జరుగుతున్న టెస్టు సిరీస్ లో స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ రివ్యూపై గళమెత్తినప్పటి నుంచి విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా తమ అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా కోహ్లిని వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లోకెక్కుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చింది. ‘ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లి మరో డొనాల్డ్ ట్రంప్‌గా మారాడు. ఎందుకంటే ట్రంప్‌లాగే తాను కూడా ముఖంపై ఉన్న కోడి గుడ్డు మరకలను దాచుకుంటూ మీడియాను అవమానపరచాలని నిర్ణయించుకున్నాడు’ అని ది డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. T 2471 - Aussi media calls Virat, Donald Trump of sports !! ... thank you Aussi media for accepting that he is a winner and the PRESIDENT !! pic.twitter.com/ZOoNtuhtC2 — Amitabh Bachchan (@SrBachchan) March 21, 2017 -
విరాట్‌ను వదలని ఆస్ట్రేలియా మీడియా
న్యూఢిల్లీ: ఆటపై దృష్టి పెడదామంటూ బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా డీఆర్ఎస్ వివాదాన్ని పక్కన పెట్టినా, ఆస్ట్రేలియా మీడియా మాత్రం తమ బుద్ది పోనించుకోవడం లేదు. ఇప్పటికే ది టెలిగ్రాఫ్ పత్రిక భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లేలపై సంచలన ఆరోపణలతో తమ అక్కసు వెళ్లగక్కింది . తాజాగా ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా తమ ఫెస్బుక్ ఖాతాలో కోహ్లిని జంతువులతో పోలుస్తు ఒక ఫోటోని పోస్ట్ చేసి మరో వివాదానికి తెరలేపింది. కోహ్లి , పిల్లి, కుక్కపిల్ల, పాండా జంతువుల ఫోటోతో వెటెల్ ఆఫ్ ది వీక్ అని పోస్ట్ చేసింది. దీనికి క్యాప్షన్‌గా ‘ ఇటీవల జరిగిన పరిణామాలు మన వెటెల్ ఆఫ్ ది వీక్ అవార్డుకు ప్రేరేపించే విధంగా ఉన్నాయి. పిల్లలు మీ తాతయ్యలను అడగండి. మిగిలిన విషయాలు మీకు తెలుసు అని’ రాసింది. దీనిపై భారత్ ఎలా స్సందిస్తుందో చూడాలి. ఇప్పటికే బీసీసీఐ ఆటపై దృష్టి మరల్చకుండా ఉండేందుకు ఐసీసీకి చేసిన ఫిర్యాదు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఒక వైపే వివాదాన్ని పక్కన పెట్టినా మరో వైపు రెచ్చగొట్టే చర్యలు పాల్పడుతుండటంతో ఇరు జట్ల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం కోల్పోతుంది. -
మళ్లీ మొదలు పెట్టేశారు...
కోహ్లి, కుంబ్లేలపై విషం కక్కిన ఆస్ట్రేలియా మీడియా మెల్బోర్న్: ఒకవైపు డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ వివాదాన్ని మరచి ఆటపై దృష్టి పెడదామంటూ క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ సిద్ధ పడగా, మరోవైపు ఆసీస్ మీడియా మాత్రం తమ బుద్ధిని పోనిచ్చుకోలేదు. రివ్యూపై రగడ సాగుతున్న సమయంలోనే దానికి పోటీగానా అన్నట్లు ఒక వివాదాస్పద కథనాన్ని ప్రచురించింది. ఇందులో భారత కెప్టెన్ కోహ్లి, కోచ్ కుంబ్లేలపై తీవ్ర ఆరోపణలు చేసింది. ‘డెయిలీ టెలిగ్రాఫ్ ఆస్ట్రేలియా’ పత్రిక రాసిన కథనంలో (ఇది ఆసీస్ ఆటగాళ్లపై భారత్ ఐసీసీకి చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోక ముందు ప్రచురితమైంది) నేరుగా ఆసీస్ బోర్డుకు, ఆటగాళ్లకు సంబంధం లేకపోయినా దీని ఆధారంగా వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలతో మరోసారి క్రికెట్ వాతావరణాన్ని చెడగొట్టేందుకు మాత్రం అవకాశముంది. ఈ కథనం ప్రకారం... టెస్టు మ్యాచ్‌లో ఒక దశలో కోహ్లి అసహనంతో ఓ ఆస్ట్రేలియా అధికారిపై ఎనర్జీ డ్రింక్ బాటిల్ విసిరేశాడు. ‘ఆసీస్ జట్టు గౌరవాన్ని దెబ్బ తీసే పనిలో కూడా కోహ్లి ముందుండి జట్టును నడిపిస్తున్నాడు సరే. ఆస్ట్రేలియా అధికారి ఒకరిపై ఆరెంజ్ గెటరాడ్ బాటిల్‌ను పడేయడం కూడా అలాంటిదేనా’ అని ఆ కథనంలో రాశారు. పైగా కోహ్లి మైదానం వదిలే సమయంలో ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ బూతులు తిట్టాడని, గొంతు కోస్తా అన్నట్లుగా హ్యాండ్స్కోంబ్ వైపు సైగ చేశాడని కూడా ఈ కథనంలో ఉంది. ‘ఇప్పుడు కోహ్లి చెబుతున్న క్రీడాస్ఫూర్తి అనేది ఈ మ్యాచ్‌లో ఎప్పుడో అతని చేతుల్లో నే చచ్చిపోయింది. ఒక అంతర్జాతీయ జట్టు కెప్టెన్ ఇంత ఘోరంగా విలన్ తరహాలో వ్యవహరించడం అర్జున రణతుంగ తర్వాత ఇదే మొదటిసారి’ అని ఈ పత్రిక పేర్కొంది. కోచ్ కుంబ్లేను కూడా టెలిగ్రాఫ్ వదిలి పెట్టలేదు. ఆయన్ని ‘మంకీ గేట్ సూత్రధారి’గా అభివర్ణించిన ఆ పత్రిక... కుంబ్లేనే తెర వెనక ఉండి అన్నీ నడిపిస్తున్నారని విమర్శించింది. ‘రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి అవుట్‌పై కుంబ్లేకు కోపం వచ్చింది. అంతే... నిబంధనలను పట్టించుకోకుండా అతను మ్యాచ్ అఫీషియల్స్ బాక్స్‌లోకి దూసుకెళ్లి వివరణ కోరడం విచిత్రం’ అని ఈ కథనంలో పత్రిక ఆరోపించింది. -
ఆస్ట్రేలియన్ మీడియా కూడా అదుర్స్ అంది!
ఆస్ట్రేలియా జట్టును ఇంటికి పంపేసి.. టీమిండియాను టి20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లోకి తీసుకెళ్లిన విరాట్ కోహ్లీని భారత మీడియా ప్రశంసించిందంటే అది మామూలే. కానీ, స్లెడ్జింగే లక్ష్యంగా భావించే ఆస్ట్రేలియా, అక్కడి మీడియా కూడా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించింది! ఇది పూర్తిగా 'విరాట్ షో' అని స్టీవ్ స్మిత్ అన్నాడని, అది నూటికి నూరుశాతం నిజమని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రికలో క్రిస్ బరాట్ రాశారు. ఒంటిచేత్తో భారత బ్యాటింగ్ మాస్ట్రో ఆస్ట్రేలియాను ఇంటికి పంపేశాడని అన్నారు. ఈ మ్యాచ్ గెలుచుకున్నది ఒకే ఒక్క వ్యక్తి అని డైలీ టెలిగ్రాఫ్‌లో బెన్ హార్న్ రాశారు. ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా ఆశలు కుప్పకూలిపోగా, టీమిండియా సగర్వంగా సెమీస్‌లోకి వెళ్లిందన్నారు. ఆ సమయంలో ప్రపంచ క్రికెట్ మొత్తమ్మీద విరాట్ కోహ్లీ లాంటి టాలెంట్ ఇంకెక్కడా లేదనిపించిందని చెప్పారు. అత్యంత కష్టమైన ఛేజింగును కూడా అత్యంత సులభంగా మార్చింది కేవలం కోహ్లీ ఇన్నింగ్సేనని ద ఆస్ట్రేలియన్ న్యూస్పేపర్లో గిడియాన్ హై అన్నారు. ఇలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ పుణ్యమాని తాము ఇంటికెళ్లిపోవాల్సి రావడంతో అసంతృప్తిగా ఉందని ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ తరఫున జెఫ్ లెమన్ రాశారు. విరాట్ నుంచి అద్భుతమైన క్లాసీ ఇన్నింగ్స్ వచ్చిందని, విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలని స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీ నుంచి క్లాస్ పెర్ఫార్మెన్స్ వచ్చిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కామెంట్ చేశాడు.