'కోహ్లీకి అహం, అతనో ఉన్మాది'
'కోహ్లీకి అహం, అతనో ఉన్మాది'
Published Wed, Mar 29 2017 1:21 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM
సిడ్నీ: ఆస్ట్రేలియా మీడియా బుధవారం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు చేసింది. విరాట్ కోహ్లీ 'క్లాస్ లెస్' ఆటగాడని.. అతను చిన్నపిల్లాడికంటే దారుణంగా ప్రవర్తిస్తాడని పేర్కొంది. నాలుగో టెస్టు విజయం తర్వాత కోహ్లీ మాట్లాడిన తీరు వల్ల అతన్ని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇక ముందెన్నడూ స్నేహితుడిగా చూడరని చెప్పింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అజింక్యా రహానేను బీర్ పార్టీకి పిలిచినప్పుడు వెళ్లకపోవడంపై దుమ్మెత్తిపోసింది.
ఆఖరి టెస్టు ముగిసిన తర్వాత ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా కోహ్లీ తన చిన్నపిల్లాడి మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నాడని డైలీ టెలీగ్రాఫ్ అనే పత్రిక పేర్కొంది. కోహ్లీ ఓ ఉన్మాది అని కూడా వ్యాఖ్యానించింది. మురళీ విజయ్‌పై అనవసరంగా నోరు పారేసుకున్న స్టీవ్ స్మిత్ క్షమాపణలు కోరాడని.. కోహ్లీ కూడా ఆస్ట్రేలియన్ క్రికెటర్లకు క్షమాపణ చెప్పాలని హెరాల్డ్ సన్ అనే పత్రిక డిమాండ్ చేసింది. కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఆస్ట్రేలియా మీడియా విరాట్‌పై పలుమార్లు నోరు పారేసుకుంది. విరాట్‌పై వస్తున్న విమర్శలు మంచివి కావని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ హితవు పలికినా ఆస్ట్రేలియా పత్రికల నోరు మూతపడలేదు.
Advertisement