
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేసే సమయంలో తమ జట్టు ఆటగాళ్లెవరూ అతడిని కవ్వించే ప్రయత్నం చేయరని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజెల్‌వుడ్ చెప్పాడు. అలా చేయడం వల్ల కోహ్లిలోని అత్యుత్తమ ఆట బయటకొస్తుందని అది మరింత ప్రమాదకరమని హాజెల్‌వుడ్ అన్నాడు. ‘కోహ్లిని రెచ్చగొట్టేందుకు మేం సాహసించం. అతని రెచ్చగొడితే ఏమవుతుందో 2018 సిరీస్‌లోనే మేం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. కోహ్లి కూడా ఆటలో పోటీని ఇష్టపడతాడు. ఇలాంటి సందర్భాల్లో అతను మరింతగా చెలరేగిపోతాడు. కోహ్లి బ్యాటింగ్ చేసే సమయంలో స్లెడ్జింగ్ జోలికే వెళ్లకూడదు. బౌలర్లెవరూ ఆ పని చేయకూడదు’ అని హాజెల్‌వుడ్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment