diplomatic ties
-
భారత్ అంటే "911 కాల్".. మాల్దీవుల మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
మాలే: మాల్దీవులు-భారత్ మధ్య కొనసాగుతున్న వివాదంపై ఆ దేశ మాజీ రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ స్పందించారు. ప్రధాని మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం మాల్దీవుల ప్రభుత్వానికే చిన్నచూపు అని ఆమె అన్నారు. రక్షణతో సహా వివిధ రంగాలలో సహాయం చేస్తూ భారతదేశం నమ్మకమైన మిత్రదేశంగా ఉందని చెప్పారు. భారత్‌తో మాల్దీవులకు ఉన్న చిరకాల బంధాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఆమె విమర్శించారు. మాల్దీవుల మంత్రుల అవమానకరమైన వ్యాఖ్యలపై మారియా అహ్మద్ నిరాశను వ్యక్తం చేశారు. మాల్దీవుల పట్ల భారతదేశాన్ని "911 కాల్"(అమెరికాలో అత్యవసర సేవల నెంబర్)గా అభివర్ణించారు. ఎప్పుడూ కాల్ చేసినా మాల్దీవులను రక్షించడానికి సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రధాని మోదీని అవమానించడం ప్రస్తుత ప్రభుత్వ చిన్న చూపు అని విమర్శించారు. 'మేము అధికారంలో ఉన్నప్పుడు అందరితో స్నేహంగా ఉన్నాం. భారతదేశంతో భద్రతా సమస్యలను పంచుకున్నాం. భారత్ కూడా ఎల్లప్పుడూ మాకు సహాయం చేస్తుంది. రక్షణ రంగంలో సామర్థ్యం పెంపొందించడం మాల్దీవులను స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రయత్నించాం' అని మరియా అహ్మద్ దీదీ అన్నారు. #WATCH | Male: On the row over Maldives MP's post on Prime Minister Narendra Modi, Former Maldives Defence Minister Mariya Ahmed Didi says, "... India has been our 911 call, whenever we need it, we give a call and you all come to our rescue. That kind of a friend. When you see… pic.twitter.com/9X64vqwWwg — ANI (@ANI) January 8, 2024 ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై మాల్దీవుల విదేశాంగ మంత్రిని పార్లమెంట్లో ప్రశ్నించాలని ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు మికేల్ నసీమ్ పిలుపునిచ్చారు. అవమానకర వ్యాఖ్యలు చేసిన సభ్యులు జవాబుదారీతనంగా ఉండాలని కోరారు. భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ దేశ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ి ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పాటైంది. భారత్ గురించి హైళనగా మాట్లాడటంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు నినాదాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇరుదేశాలు హైకమిషనర్లకు సమన్లు జారీ చేశాయి. ఇదీ చదవండిL: భారత హైకమిషనర్‌కు మాల్దీవులు సమన్లు -
భారత్-కెనడా వివాదం: అమెరికాలో విదేశాంగ మంత్రుల రహస్య భేటీ!
భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్, కెనడా విదేశాంగమంత్రి మెలానీ అమెరికాలో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్రిటన్ వార్తా పత్రిక ఫినాన్షియల్ టైమ్స్ కథనం ప్రచురించింది. భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించేందుకు, న్యూఢిల్లీతో దౌత్యపరమైన సంబంధాలను పునురద్ధరించేందుకు కెనడా ప్రభుత్వం ప్రయత్నిన్నట్లు పేర్కొంది. అయితే ఈ భేటీపై అటు కెనడా కానీ, ఇటు భారత్ కానీ ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. కెనడా దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లాలంటూ భారత్ గడువు విధించిన నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఖలిస్తానీ సానూభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెన్సీల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. కెనడా ఆరోపలను భారత్ తీవ్రంగా ఖండించింది. అనంతరం రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. కెనడాకు వీసా సేవలను భారత్ నిలిపి వేసింది. చదవండి: పఠాన్‌కోట్ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్ పాకిస్థాన్‌లో హతం -
'48 గంటల్లోగా మా దేశం విడిచి వెళ్లిపోండి'
రియాద్: ఇరాన్ తో సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు తెంచుకుంది. 48 గంటల్లోగా తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఇరాన్ దౌత్యవేత్తలను ఆదేశించింది. ఇరాన్ లోని తమ దౌత్య కార్యాలయంపై దాడి జరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సౌదీలో షియా వర్గీయుల మతపెద్ద నిమ్ర్ అల్ నిమ్ర్‌ను ఉరి తీయడంతో ఇరాన్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. సౌదీ దౌత్య కార్యాలయంపై ఆదివారం పెట్రోల్ బాంబులు, రాళ్లతో ఆందోళనకారులు దాడికి దిగారు. ఈ దాడి గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి సౌదీ విదేశాంగ మంత్రి ఆదెల్ ఆల్-జుబేర్ తెలిపారు. ఈ దాడి నుంచి బయటపడ్డ తమ దౌత్యవేత్తలు సురక్షితంగా దుబాయ్ చేరుకున్నారని వెల్లడించారు. తమ దౌత్య కార్యాలయంపై దాడిని అడ్డుకునేందుకు ఇరాన్ ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. ఆయుధాలు సరఫరా చేస్తూ అల్‌ఖాయిదాకు ఇరాన్ అండగా నిలుస్తోందని అన్నారు. నిమ్ర్ అల్ నిమ్ర్‌కు మరణశిక్ష అమలు చేయడాన్ని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఖండించారు. సౌదీ అరేబియా అమానవీయంగా ప్రవర్తించిందని వ్యాఖ్యానించారు. సౌదీ ఎంబసీపై దాడికి పాల్పడినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత వర్గాలను ఆదేశించారు.