gangsters arrest
-
ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్?
న్యూఢిల్లీ: కెనడాలో బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్‌వార్‌లో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె ప్రత్యర్ధులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ హత్యకు పూర్తి బాధ్యత తమదేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మాదే బాధ్యత.. కెనడాలో జరిగిన ముఠా కాల్పుల్లో ఖలిస్థా ఉగ్రావది సుఖ దునెకె హత్యకు గురయ్యాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఈ హత్య తామే చేయించామని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గ్యాంగ్స్టర్లు గుర్లాల్ బ్రార్, విక్కీ ముద్దుకేరా హత్యలతో సుఖ దునెకెకు సంబంధముందని వాడు మాదకద్రవ్యాలకు బానిసాయి ఫేక్ వీసా మీద కెనడా పారిపోయాడని వాడు చేసిన తప్పులకు శిక్ష పడిందని మా శత్రువులు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బ్రతకరని హెచ్చరించారు. లారెన్స్ పాత్రపై అనుమానాలు.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు ఆరోపణల్లో అహ్మదాబాద్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్వాలా హత్య కేసులో కూడా లారెన్స్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. సోషల్ మీడియా పోస్టును బట్టి ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు భారత్ కెనడా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ హత్య జరగడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అక్కడి వారికి ట్రావెల్ అడ్వైజరీ మార్గదర్శకాలు చేసి వీసా సేవలను నిలిపివేసింది. చిలికి చిలికి.. భారత్ కెనడా మధ్య సంబంధాలు అంతకంతకు బలహీనపడుతున్నాయి. ఖలిస్థాన్ ఉద్యమం పేరిట ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ర్యాలీగా నిర్వహించి వివాదానికి తెరతీశాయి. ఆనాడు భారత దేశం ఆ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసినా తేలిగ్గా తీసుకున్న కెనడా తర్వాత జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ ఏజెంట్లు కారణమంటూ చేసిన వ్యాఖ్యలు తగువుకు ఆజ్యం పోశాయి. ఇంతలోనే మరో ఉగ్రవాది హత్య జరగడంతో కెనడా వీసాలను నిలిపివేసింది. BIG ⚡️Lawrence Bishnoi gang claims responsibility for K-terrorist Sukhdool Singh's killing in Canada pic.twitter.com/6ZN1T30pb4 — Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2023 ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులో దూసుకెళ్తున్న భారతీయుడు -
అంతా జంక్.. చీకటి వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టారు
Asia's largest 'junk market' shuts down: చోరీ చేసిన కార్లను విడిభాగాలుగా విడగొట్టి, వాటితో జోరుగా వ్యాపారం సాగిస్తున్న సోటిగంజ్ మార్కెట్‌ను ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఆదివారం సీజ్ చేసింది. ఢిల్లీతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దొంగిలించిన కార్లను ఈ మార్కెట్లో విడిభాగాలుగా చేసి ఇల్లీగల్‌గా వ్యాపారం సాగుతోంది. ఈ దందాకు చెందిన హాజీ ఇక్బాల్, హాజీ గల్లా అనే ఇల్లీగల్ గ్యాంగ్స్టర్లు పోలీసులకు పట్టుబడిన తర్వాత సోటిగంజ్ మార్కెట్ మూసివేతకు ఉపక్రమించారు. అంతేకాకుండా కోట్ల విలువచేసే ఆస్తులను కూడా సీజ్ చేశారు. నివేదికల ప్రకారం.. దొంగిలించిన కార్లను విడిభాగాలుగా విడగొట్టి అక్రమ వ్యాపారం చేయడం ఈ మార్కెట్లో 1990లలో ప్రారంభమైంది. కాలక్రమేణా ఇళ్లలోపల గౌడౌన్లు నిర్మించి దొంగ కార్ల వ్యాపారం ప్రారంభించారు. 1,000 మందికి పైగా పనిచేసే ఈ మార్కెట్లో ప్రస్తుతం దాదాపుగా 300 కంటే ఎక్కువ దుకాణాలున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని దుకాణాలను మూసివేయాలని అక్కడి ఎస్హెచ్ఓ ఆదేశించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ కేసులో మీరట్ జిల్లా ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ.. ఈ మార్కెట్లో అక్రమ వ్యాపారం చేస్తున్న 100 షాప్‌లను గుర్తించాం. స్టాక్ సమాచారాన్ని సేకరిస్తే తప్ప, వాటికి ఎలాంటి సరుకులు చేరనివ్వబోమని' వెల్లడించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చూసేందుకు పరిపాలనా యంత్రాంగం ముఖ్యమైన చర్యలు తీసుకుంది. ఆదివారం మధ్యాహ్నం సోటిగంజ్ మార్కెట్లో 200 మందికి పైగా సైనికులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. సోటిగంజ్‌లోని ప్రధాన జంక్‌లలో హాజీ గల్లా, హాజీ ఇక్బాల్, హాజీ అఫ్తాబ్, ముష్తాక్, మన్ను అలియాస్ మీనుద్దీన్, హాజీ మొహ్సిన్, సల్మాన్ అలియాస్ షేర్, రాహుల్ కాలా, సలాహుద్దీన్ ఉన్నారు. ఈ స్క్రాపర్లపై 2,500కు పైగా కేసులు ఇప్పటికే నమోదయ్యి ఉన్నాయి. వీరిలో 37 మందిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా తెల్పింది. చదవండి: తక్కువ వడ్డీ పేరిట అదితి గోల్డ్ లోన్ సంస్థ ఘరానా మోసం! కిలోల బంగారంతో పరార్.. -
నిందితులను పట్టించిన సెల్‌ఫోన్
- మిస్టరీ వీడిన జంట హత్యల కేసు –పోలీసుల అదుపులో నిందితులు? శింగనమల : శింగనమల సమీపంలోని రుష్యశృంగుని కొండపై జరిగిన జంట హత్యల కేసును పోలీసులు చేధించారు. నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. గత నెల 19న జరిగిన జంట హత్యల కేసు పోలీసులకు సవాలుగా మారింది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అయినా ఎటువంటి ఆధారం దొరకలేదు. చివరకు హత్యకు గురైన వ్యక్తి సెల్‌ఫోన్ హంతకులను పట్టించింది. హంతకులు 20 సంవత్సరాలు లోపు యువకులు కావడంతో పోలీసులే అశ్చర్య పోయారు. గుప్తనిధుల కోసం వెళ్లి... బుక్కరాయసముద్రం మండలంలోని బి.కొత్తపల్లికి చెందిన ఒక దేవాలయం పూజారి కుమారుడు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడు గుప్తనిధుల కోసం పలు ప్రాంతాలకు వెళ్లేవాడు. అందులో భాగంగానే శింగనమల సమపంలోని రుష్యశృంగుని కొండపైన గుప్త నిధుల కోసం ఒక స్నేహితుడితో కలిసి గత నెల 18న పరిశీలించారు. 19వ తేదిన వారు మరో ఇద్దరితో కలిసి రుష్యశృంగుని కొండపైకి రెండు ద్విచక్ర వాహనాల్లో వెళ్లారు. అప్పటికే కొండపైన బత్తలపల్లికి చెందిన పెద్దయ్య, వీఆర్ఏ ఈశ్వరయ్య, ధర్మవరానికి చెందిన సావిత్రి ఉన్నారు. దీంతో వారి ప్రయత్నం ఫలించలేదు. అయితే డబ్బు కోసం వారిపై దాడి చేశారు. ఈదాడిలో వారు తీవ్రంగా గాయపడడంతో వారి వద్ద నగదు, పెద్దయ్యకు చెందిన సెల్‌ఫోన్ తీసుకుపోయారు. దాడిలో పెద్దయ్య అక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఈశ్వరయ్య మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయాలు తగిలిన సావిత్రి కాస్త కోలుకుంది. సెల్‌ఫోన్ ఆధారంగా.. పెద్దయ్య సెల్‌పోన్‌ను అనంతపురంలోని ఒక సెల్‌పాయింట్‌లో హత్యలకు పాల్పబడిన ప్రధాన నిందితుడు విక్రయించాడు. ఆ సెల్‌ఫోన్ ఆన్ చేయడంతో..దీనిపై నిఘా ఉంచిన పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సెల్పాయింట్ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వివరాలు ఆరా తీశారు. వెంటనే సెల్‌ఫోన్ విక్రయించిన బి.కొత్తపల్లికి దేవాయం పూజారి కుమారుడిని అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. అలాగే మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసున్నారు.