భారత్‌కు ఓటేసినట్టే.. పాక్‌కు వేయకూడదా?: చైనా
న్యూఢిల్లీ: అణుశక్తి సరఫరా బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు స్ధానం కల్పిస్తే.. పాకిస్తాన్‌కు కూడా కల్పించాలని చైనాకు చెందిన ఓ కమ్యూనిస్టు పార్టీ అధికారి అన్నారు. 19వ ఆసియా భద్రతా సమావేశాల సందర్భంగా మాట్లాడిన మా గ్జియాంగ్వు సంచలన వ్యాఖ్యలు చేశారు. శక్తి సామర్ధ్యాల్లో ఇరుదేశాలు సమానంగా ఉన్నాయని 48 సభ్య దేశాలు కలిగిన ఎన్‌ఎస్‌జీలో చేరేందుకు ఇరువురికి అవకాశం ఇవ్వాలని అన్నారు. ఎన్‌ఎస్‌జీలో సభ్వత్వానికి చైనా భారత్‌కు ఓటేసిన చేతితోనే పాకిస్తాన్‌కు ఎందుకు ఓటు వేయకూడదని? ప్రశ్నించారు.
పాకిస్తాన్ తమకు మిత్రదేశమని దానికి అవకాశం ఎందుకు ఇవ్వకూడదని అన్నారు. ఒకరికి చాన్స్ ఇచ్చి మరొకరిని వదిలేస్తే వివక్ష చూపినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. అణుశక్తికి సంబంధించిన టెక్నాలజీని అక్రమంగా లిబియాకు విక్రయిస్తూ పాకిస్తాన్ పట్టుబడిందని.. భారత్‌కు అలాంటి బ్యాడ్ ట్రాక్ ఏదీ లేదని చెప్పారు. అయితే చైనాకు ఈ విషయంపై కొన్ని సొంత అభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు.