ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదా నుంచి భారత్ కు ఉగ్రవాద ముప్పు ఉందని ఎన్ఎస్జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్) హెచ్చరించింది.
ఢిల్లీ: ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదా నుంచి భారత్ కు ఉగ్రవాద ముప్పు ఉందని ఎన్ఎస్జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్) హెచ్చరించింది. ఒకేసారి పలుపట్టణాల్లో దాడులు చేసే అవకాశం ఉందని ఎన్ఎస్జీ డిప్యూటీ జనరల్ జయంత్ చౌదరి స్పష్టం చేశారు. ప్రధాన నగరాల్లో దాడి చేయడానికి ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదాలు ఉమ్మడిగా దాడికి సిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా గోవా, బెంగళూరు, అమృతసర్ లలో ఉగ్రదాడులు చేసే అవకాశం ఉందన్నారు. దీంతో పాటు పలుపట్టణాల్లో దాడులు చేయడానికి కూడా సంసిద్ధమైనట్లు తెలిపారు. రాబోవు పండుగల సీజన్ లో ఆ రెండు ఉగ్రవాద సంస్థలు దాడికి పాల్పడవచ్చని ఇంటలిజెన్సీ ఏజేన్సీ హెచ్చరించిన నేపథ్యంలో జయంత్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది ఆందోళన కల్గించే అంశమైనా.. దీన్ని ఎదుర్కొనడానికి ఎన్ఎస్జీ పూర్తి సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు.