భారత్‌కు ఇక మరింత కష్టం: చైనా
బీజింగ్: అణు సరఫరా గ్రూపు(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వం అంశం మరింత కఠినతరం కానుందని చైనా చెప్పింది. అణు సరఫరాయేతర దేశాలన్నింటి విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మొత్తం 48 దేశాల సభ్యత్వం కలిగిన ఈ గ్రూపులో భారత్‌కు చాలా దేశాలు మద్దతిస్తున్నప్పటికీ ఒక్క చైనా మాత్రం అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. భారత్‌కు సభ్యత్వం ఇస్తే పాకిస్థాన్‌కు సభ్యత్వం ఇవ్వాలంటూ చైనా మొండికేస్తుంది.
అయితే, ఆయుధ వ్యవస్థపై నియంత్రణ లేని పాక్ కూడా ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం ఇవ్వడం ఏమాత్రం సరికాదని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చైనా ప్రతిసారి మొకాలడ్డుతోంది. ‘కొత్తగా తీసుకొచ్చిన విధానాల వల్ల ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వం అనేది గతంలో కంటే మరింత క్లిష్టంగా మారనుంది’ అంటూ చైనా విదేశాంగ వ్యవహారాల సహాయమంత్రి లి హులాయి మీడియాకు చెప్పారు. అయితే, భారత్‌కు క్లిష్టతరంగా మారనున్న అంశాలు ఏమిటనే విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.