'ఎన్‌ఎస్జీలో భారత్ ఉంటే చైనాకు ప్రమాదం' | India's NSG entry will trigger N-race, says China | Sakshi
Sakshi News home page

'ఎన్‌ఎస్జీలో భారత్ ఉంటే చైనాకు ప్రమాదం'

Published Wed, Jun 15 2016 1:49 PM | Last Updated on Mon, Aug 13 2018 3:32 PM

India's NSG entry will trigger N-race, says China

బీజింగ్: అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్జీ)లో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న పొరుగుదేశం చైనా ఆ అంశంపై తాజాగా మరింత కఠిన స్వరం వినిపించింది. ఎన్‌ఎస్జీలో భారత్‌కు సభ్యత్వం ఇస్తే చైనా జాతీయ ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయని, పాకిస్తాన్‌ను రెచ్చగొట్టినట్టవుతుందని చైనా అధికారిక మీడియా మంగళవారం వ్యాఖ్యానించింది.

ఎన్‌ఎస్జీలో భారత్‌కు సభ్యత్వం లభించినట్లయితే ఈ ప్రాంతంలో అణ్వస్త్ర పోటీ నెలకొనే అవకాశముందని పేర్కొంది. కాగా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ)లో ఏడాది లోపల భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం లభించే అవకాశముందని ఆ సంస్థ సెక్రటరీ జనరల్ రషీద్ అలిమోవ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement