ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విదేశాంగ విధానంలో విఫలమయ్యారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్ఎస్జీలో భారత్ కు సభ్యత్వంలో తలెత్తిన సమస్యపై మోదీ సమాధానం చెప్పాలని కేజ్రీ డిమాండ్ చేశారు.
స్విస్ అధ్యక్షుడు జోహన్ ష్నీదర్ అమ్మన్ జూన్ 6 న ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి మద్దతును తాము ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించినపుడు ఇటీవల ఆదేశంలో ఎందుకు పర్యటించలేదని ఆయన ప్రశ్నించారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్ పీటీ) లో సంతకం చేయనందువల్లే ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి మద్దతును చైనా,స్విర్డర్లాండ్ నిరాకరించిన విషయం తెలిసిందే.