ఎన్‌ఎస్‌జీ నూతన డీజీ తాయల్ | IPS officer RC Tayal appointed new NSG DG | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌జీ నూతన డీజీ తాయల్

Published Tue, Jun 9 2015 3:12 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

ఎన్‌ఎస్‌జీ నూతన డీజీ తాయల్

ఎన్‌ఎస్‌జీ నూతన డీజీ తాయల్

న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక సంస్థ అయిన జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) నూతన డెరైక్టర్ జనరల్ (డీజీ)గా హరియాణాకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్.సి. తాయల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలపడంతో సోమవారం ఈ మేరకు ఉత్తర్వు జారీ అయింది. అస్సాం-మేఘాలయా క్యాడర్‌కు చెందిన 1980 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన తాయల్ వచ్చే ఏడాది ఆగస్టులో పదవీవిరమణ చేసే వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఎన్‌ఎస్‌జీ ప్రస్తుత చీఫ్ జె.ఎన్. చౌధురి మే 31న రిటైర్ కావడంతో అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న తాయల్ గతంలో సశస్త్ర సీమా బల్ అదనపు డెరైక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఉగ్రవాద, హైజాక్ నిరోధానికి ఎన్‌ఎస్‌జీని 1984లో ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement