ఎన్ఎస్జీ నూతన డీజీ తాయల్
న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక సంస్థ అయిన జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) నూతన డెరైక్టర్ జనరల్ (డీజీ)గా హరియాణాకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్.సి. తాయల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలపడంతో సోమవారం ఈ మేరకు ఉత్తర్వు జారీ అయింది. అస్సాం-మేఘాలయా క్యాడర్‌కు చెందిన 1980 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన తాయల్ వచ్చే ఏడాది ఆగస్టులో పదవీవిరమణ చేసే వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఎన్ఎస్జీ ప్రస్తుత చీఫ్ జె.ఎన్. చౌధురి మే 31న రిటైర్ కావడంతో అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న తాయల్ గతంలో సశస్త్ర సీమా బల్ అదనపు డెరైక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఉగ్రవాద, హైజాక్ నిరోధానికి ఎన్ఎస్జీని 1984లో ఏర్పాటు చేశారు.