ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత స్వభ్యత్వం కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన దౌత్యం విఫలమవ్వడంతో కాంగ్రెస్ పార్టీ కేంద్ర సర్కార్ పై విరుచుకుపడింది. సియోల్‌లో జరిగిన ఎన్ఎస్జీ సదస్సులో అంతర్జాతీయంగా భారత్ కు ఇది భంగపాటుగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించగా.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి.. నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
ఎన్ఎస్జీలో భారత్‌కు స్వభ్యత్వ నిరాకరణ మోదీ దౌత్య వైఫల్యానికి నిదర్శమని రాహుల్ ట్విట్టర్ లో విమర్శించారు. ఎన్ఎస్జీ విషయంలో నరేంద్రమోదీ జరిపిన సంపద్రింపులు విఫలమయ్యాయని, ఇది దౌత్యపరంగా మోదీ ఫెయిలవ్వడమేనని హ్యాష్‌ట్యాగ్ జోడించారు. ప్రతిష్టాత్మక ఎన్ఎస్జీలో స్వభ్యత్వం కోసం భారత్ కొన్ని నెలలుగా సంప్రదింపులు జరిపినప్పటికీ, చివరిక్షణంలో చైనా మోకాలడ్డటంతో ఈ ప్రయత్నం విఫలమైన సంగతి తెలిసిందే.
NSG: How to lose a negotiation by Narendra Modi #FailedModiDiplomacy
— Office of RG (@OfficeOfRG) June 24, 2016