
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ రైల్వేస్టేషన్ల విషయంలో తెలంగాణ ఈసారి బాగా వెనకబడింది. గత రెండేళ్లుగా రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లు పరిశుభ్రమైన జాబితాలో మెరుగైన స్థానం దక్కించుకోగా ఈసారి మాత్రం బాగా వెనకబడిపోయాయి. ప్రస్తుత జాబితాలో హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ 17వ స్థానం, సికింద్రాబాద్ 42, వరంగల్ 51, రామగుండం 52, కాజీపేట 67, కాచిగూడ 69, ఖమ్మం 80 స్థానాలు దక్కించుకున్నాయి. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ బుధవారం ర్యాంకుల జాబితాను విడుదల చేశారు.
విజయవాడకు 7వ ర్యాంకు
స్వచ్ఛత విషయంలో విజయవాడ రైల్వేస్టేషన్ దేశంలోనే టాప్–10 జాబితాలో స్థానం దక్కించుకుంది. జైపూర్, జోధ్‌పూర్, దుర్గాపుర స్టేషన్లు తొలి 3 ర్యాంకులు దక్కించుకోగా, ఏపీ నుంచి విజయవాడ రైల్వేస్టేషన్ 7, సామర్లకోట 45, తిరుపతి 70, నెల్లూరు 81, విశాఖ 84, పలాస 92, అనంతపురం 105, ఏలూరు 107వ ర్యాంకులను దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment