న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా ఉన్న 200 రైల్వే స్టేషన్లలో శానిటరీ న్యాప్కిన్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి గోయెల్ తెలిపారు. ఢిల్లీలోని సరోజినీ నగర్ రైల్వే కాలనీ శానిటరీ న్యాప్కిన్ తయారీ కేంద్రం ‘దస్తక్’ను ఆయన సోమవారం సందర్శించారు. ఇక్కడ తయారయ్యే ఆరు న్యాప్కిన్ల ప్యాక్ ధర రూ.22 మాత్రమేనన్నారు. మరోవైపు, తమ రాష్ట్రంలోని దాదాపు 17 లక్షల మంది బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ను అందజేయాలని ఒడిశా సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 6–12వ తరగతి బాలికలకు వీటిని ఇవ్వనున్నారు. ఇందుకు ఏడాదికి రూ.70 కోట్లు ఖర్చుకానుంది.
Comments
Please login to add a commentAdd a comment