సాక్షి, న్యూఢిల్లీ: పరిశుభ్ర రైల్వే స్టేషన్లకు ఏటా ఇచ్చే ‘స్వచ్ఛ్ రైల్, స్వచ్ఛ్ భారత్’ ర్యాంకుల జాబితాను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సోమ వారం విడుదల చేశారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. విజయవాడ 4, సికింద్రాబాద్ 6, హైదరాబాద్ 8, విశాఖపట్నం పదో స్థానంలో నిలిచాయి. ‘ఏ’కేటగిరీ రైల్వే స్టేషన్ల జాబితాలో వరంగల్లు మూడో స్థానం(గతేడాది 8వ స్థానం) దక్కించుకుంది. నిజామాబాద్ 6, మంచిర్యాల 8వ స్థానంలో నిలిచాయి. ఇక, ఏ1 స్టేషన్ల కేటగిరీలో తిరుపతి రైల్వే స్టేషన్ మూడోస్థానం (గతేడాది 19వ స్థానం) దక్కించుకుంది. పరిశుభ్రత కలిగిన రైల్వే జోన్ల జాబితాలో దక్షిణ మధ్య రైల్వే రెండోస్థానం దక్కించుకుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే తర్వాతి స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment