చెన్నై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గౌహతి ఎక్స్ప్రెస్లో గురువారం బాంబు పేలుడు సంభవించిన నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అందులోభాగంగా అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్ట్ లను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద రైల్వే క్లాక్ టవర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్కడ ఉంచిన కొన్ని బాంబులను పోలీసులు గుర్తించారు. అవి స్థానికంగా తయారైన బాంబులని పోలీసులు వెల్లడించారు.
గుంటూరులో మోడీ సభ నేపథ్యంలో... ఆగంతకులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ బాంబులు ఆ అంత శక్తిమంతమైనవి కావని రైల్వే ఎస్పీ తెలిపారు. అయితే విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్నపినాకినీ ఎక్స్ప్రెస్లో ఓ సూట్ కేసు కలకలం సృష్టించింది. సూట్ కేసును గుర్తించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి సూట్ కేసును తనిఖీ చేస్తుంది.