pinakini express
-
‘పినాకిని’ కి తప్పిన ముప్పు
తెనాలి అర్బన్: విజయవాడ నుంచి చైన్నె వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్ (12711) రైలుకు ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం 6.20 గంటలకు గుంటూరు జిల్లా తెనాలి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న రైలు, అక్కడి నుంచి బయలుదేరిన కొద్దినిమిషాలకే ఆగిపోవాల్సి వచ్చింది. ఇంకా పూర్తివేగం పుంజుకోని రైలు బోగీల్లో పెద్ద శబ్దం, కుదుపును గమనించిన రైలు డ్రైవర్ జి.సతీష్ రైలును నిలిపివేశారు. రైలు పట్టా విరిగి ఉండటాన్ని గమనించారు. ఆపట్టాను అప్పటికే రైలు ఇంజిన్‌తో పాటు నాలుగు బోగీలు దాటాయి. ఆయన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తెనాలి వే ఇన్స్పెక్టర్ రామకృష్ణ నేతృత్వంలో సిబ్బంది వచ్చి సుమారు గంటన్నరపాటు శ్రమించి రైలుపట్టాకు రెండు ముక్కలను తాత్కాలికంగా జాయింట్ చేశారు. అనంతరం రైలును పంపించారు. -
పినాకిని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
-
పినాకిని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
తెనాలి: విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న పినాకిని ఎక్స్‌ప్రెస్‌కు సోమవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడు వద్ద రైలు పట్టా విరిగిందని, గ్యాంగ్మన్ గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. వెంటనే రైలును అక్కడే నిలిపివేసిన అధికారులు, సిబ్బందితో రైల్వే ట్రాక్‌ను పునరుద్దరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనతో విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
‘పినాకినీ’ కష్టాలు..
నాయుడుపేట: ఓ వైపు టికెట్లు ఇస్తూనే మరోవైపు నాయుడుపేటలో పినాకిని ఎక్స్‌ప్రెస్‌ను నిలపకపోవడంతో ప్రయాణికులు చైన్ లాగి ఆపుతున్నారు. వరుసగా రెండో రోజూ కూడా చైన్ లాగిపోవడంతో రైలు ఆగిపోయింది. ఈ క్రమంలో లోకోపైలెట్లతో పాటు ఆర్పీఎఫ్ సిబ్బంది హుటాహుటిన పరుగులు తీసి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో టికెట్లు ఇచ్చినందునే తాము ఎక్కామని యువకులు సమాధానమిచ్చారు. మరోవైపు పినాకిని ఎక్స్‌ప్రెస్ ఆకస్మాత్తుగా ఆపేయడంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కూడా ఐదు నిమిషాలు నిలిచిపోయింది. -
కరవదిలో నిలిచిన 'పినాకిని'
ఒంగోలు : విజయవాడ నుంచి చెన్నై మహానగరానికి వెళ్తున్న పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో గురువారం సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రకాశం జిల్లా కరవదిలో దాదాపు 40 నిమిషాల పాటు నిలిచి పోయింది. దీంతో ఇంజిన్ డ్రైవర్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దాంతో ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు రైల్వే అధికారులు సాంకేతిక సిబ్బందిని కరవదికి పంపారు. అయితే రైలు అర్థాంతరంగా నిలిచిపోవడంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బెజవాడ రైల్వే స్టేషన్ వద్ద బాంబు గుర్తింపు
చెన్నై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో గురువారం బాంబు పేలుడు సంభవించిన నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అందులోభాగంగా అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్ట్ లను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద రైల్వే క్లాక్ టవర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్కడ ఉంచిన కొన్ని బాంబులను పోలీసులు గుర్తించారు. అవి స్థానికంగా తయారైన బాంబులని పోలీసులు వెల్లడించారు. గుంటూరులో మోడీ సభ నేపథ్యంలో... ఆగంతకులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ బాంబులు ఆ అంత శక్తిమంతమైనవి కావని రైల్వే ఎస్పీ తెలిపారు. అయితే విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్నపినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో ఓ సూట్ కేసు కలకలం సృష్టించింది. సూట్ కేసును గుర్తించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి సూట్ కేసును తనిఖీ చేస్తుంది. -
గూడూరు-చెన్నై మార్గంలో ట్రాక్ మరమ్మతులు: పలు రైళ్లు ఆలస్యం
నెల్లూరు జిల్లాలోని గూడూరు - చెన్నై మార్గంలో రైల్వే ట్రాక్ మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి చెన్నై వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్ 3 గంటల ఆలస్యంగా నడుస్తుందని తెలిపింది. అలాగే పాట్నా - బెంగళూరు నగరాల మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ 3.30 గంటల ఆలస్యం అవుతుందని పేర్కొంది. వీటితోపాటు భాగమతి ఎక్స్‌ప్రెస్ 2.50 గంటల ఆలస్యంగా నడుస్తుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.