‘పినాకిని’ కి తప్పిన ముప్పు | Missed threat to the Pinakini Express | Sakshi
Sakshi News home page

‘పినాకిని’ కి తప్పిన ముప్పు

Published Tue, Sep 5 2017 1:12 AM | Last Updated on Tue, Sep 12 2017 1:51 AM

Missed threat to the Pinakini Express

తెనాలి అర్బన్‌: విజయవాడ నుంచి చైన్నె వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్‌ (12711) రైలుకు ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం 6.20 గంటలకు గుంటూరు జిల్లా తెనాలి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న రైలు, అక్కడి నుంచి బయలుదేరిన కొద్దినిమిషాలకే  ఆగిపోవాల్సి వచ్చింది. ఇంకా పూర్తివేగం పుంజుకోని రైలు బోగీల్లో పెద్ద శబ్దం,  కుదుపును గమనించిన రైలు డ్రైవర్‌ జి.సతీష్‌ రైలును నిలిపివేశారు.  

రైలు పట్టా  విరిగి ఉండటాన్ని గమనించారు. ఆపట్టాను అప్పటికే రైలు ఇంజిన్‌తో పాటు నాలుగు బోగీలు దాటాయి. ఆయన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తెనాలి వే ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ నేతృత్వంలో సిబ్బంది వచ్చి సుమారు గంటన్నరపాటు శ్రమించి రైలుపట్టాకు రెండు ముక్కలను తాత్కాలికంగా జాయింట్‌ చేశారు. అనంతరం రైలును పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement