విజయవాడ: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగి రెండు రోజులైనా కాకముందే మరో రైల్లో మంటలు చెలరేగాయి. అయితే సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పింది. విజయవాడలో గంగోత్రి ఎక్స్ ప్రెస్ బోగీలో మంటలు చెలరేగాయి. ఆరో నంబర్ ప్లాట్ ఫామ్పై ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలు ఆర్పేశారు. అయితే మీడియాను రైల్వేస్టేషన్లోకి అనుమతించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలుకు మంటలు అంటుకోవడంతో జరిగిన ఘోర ప్రమాదంలో 26మంది సజీవ దహనం కాగా, పలువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
గంగోత్రి ఎక్స్ప్రెస్ బోగీలో చెలరేగిన మంటలు
Published Mon, Dec 30 2013 3:52 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement