
విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఆదివారం చైన్నె వెళ్లే వందే భారత్ రైలు ప్రారంభోత్సవం జరిగింది. దీన్ని ఢిల్లీలో వర్చువల్‌గా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30గంటలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ జెండా ఊపి రైలును పంపారు. ఈ రైలు వద్ద ప్రయాణికులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

వందేభారత్ రైలులో ప్రయాణికులు
Comments
Please login to add a commentAdd a comment