
సాక్షి, విజయవాడ : నగరంలోని రైల్వేస్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం చేశారు గుర్తుతెలియని దుండగులు. రైల్వే ట్రాక్‌పై రక్తపు మడుగులో వివస్త్రగా పడి ఉన్న వృద్దురాలిని పారిశుద్ధ్య కార్మికులు గమనించి 108లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. నగరంలోని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వృద్ధురాలిపై అత్యాచారం జరిగిందా లేదా, డబ్బుల కోసం దాడికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పట్టాలపై పడిఉన్న వృద్ధిరాలి బట్టలు, ఎండు చేపల బుట్టని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో దొరికిన వస్తువులను బట్టి బాధితురాలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినదిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment