విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల ఆందోళనకు దిగారు. విజయవాడ నుంచి ధర్మవరం కు కొత్తగా ప్రారంభించిన రైలుకు సాధారణ టికెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల ఆందోళనకు దిగారు. విజయవాడ నుంచి ధర్మవరం కు కొత్తగా ప్రారంభించిన రైలుకు సాధారణ టికెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రేజర్వేషన్ లేని వారిని రైల్వే పోలీస్ లు కిందకు దించివేశారు. ఈ రైలులో 5 ఏ.సీ, 8 స్లీపర్ భోగీలు మాత్రమే ఉన్నాయి. సాధారణ భోగీలు లేవని సాకుతో ప్రయాణికులను అనుమతిచలేదు.
దాంతో రైల్వే అధికారుల తీరు పై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని నుంచి రాయలసీమ కు రైలు వేశామని గొప్పగా చెప్పిన వారు అందులో సామాన్యులకు ప్రవేశం కల్పించలేదని ఆక్రోశం వెలిబుచ్చారు. కొత్త రైలు ఈ నెల 12 న లాంఛనంగా ప్రారంభమైనా ప్రయాణికులకు మాత్రం శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. మొదటి రోజే ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.