విజయవాడ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం | Bomb threat call to Vijayawada railway station | Sakshi
Sakshi News home page

విజయవాడ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం

Published Thu, Jan 28 2016 1:59 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

విజయవాడ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం - Sakshi

విజయవాడ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం

విజయవాడ (రైల్వేస్టేషన్) : రైల్వేస్టేషన్‌లో బాంబు ఉందంటూ బుధవారం ఫోన్ రావడంతో పోలీసు అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక ఆగంతకుడు సెల్ నుంచి ఫోన్‌చేసి, రైల్వే స్టేషన్‌లో బాంబు ఉందని చెప్పాడు. అప్రమత్తమైన పోలీసు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి స్టేషన్‌లోని పలు ప్లాట్‌ఫారాలు, పార్శిల్ కార్యాలయంతో పాటు స్టేషన్‌లోని అణువణువూ తనిఖీచేశారు.

పలు రైళ్లలో సైతం తనిఖీలు నిర్వహించారు. రైల్వే ఎస్‌పీ షిమోషి బాజ్‌పాయ్ నేతృత్వంలో 60 మంది సిబ్బంది స్టేషన్‌లో విస్తృతంగా తనిఖీ చేశారు. రెండు గంటలసేపు గాలించినా బాంబు ఆనవాళ్లు లభించకపోవడంతో వచ్చిన ఫోన్‌కాల్ ఆకతాయిగా నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ నంబరు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement