ఢిల్లీ: ఢిల్లీ రాజధాని పరిధిలో బుధవారం 100 స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపుల ఘటనపై ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా స్పందించారు. బాంబు బెదిరింపుకు సంబంధించి వచ్చిన ఈ మెయిల్స్‌ను పోలీసులు ట్రేస్ చేసినట్లు వెల్లడించారు. ఈ విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నామని ఎల్జీ తెలిపారు.
కేంద్ర హోం శాఖ స్పందన..
ఢిల్లీ స్కూళ్ల బాంబు మెయిల్ బెదిరింపు ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. పాఠశాలలకు వచ్చినవి నకిలీ బెదిరింపు మెయిల్స్ అని స్పష్టం చేసింది. పలు పాఠశాలలను ఢిల్లీ పోలీసులు తనిఖీ చేశారని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను స్కూళ్ల యాజమాన్యాలు మూసివేసినట్ల తెలిపారు.
అంతకంటే ముందు.. బాంబు బెదిరింపులై ఢిల్లీ మంత్రి అతిశీ స్పందించారు. ‘ఇవాళ ఉదయం కొన్ని స్కూళ్లులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు విద్యార్థులను స్కూళ్ల నుంచి ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. అయితే పాఠశాలల్లో ఎటువంటి బాంబు లేవని పోలీసులు గుర్తించారు. మేము స్కూళ్లు, పోలీసులతో టచ్‌లో ఉన్నాం. పిల్లల తల్లిదండ్రులు, పాఠశాలల అధికారులు ఆందోళన పడొద్దు. స్కూళ్ల అధికారులు కూడా తల్లిదండ్రులకు టచ్‌లో ఉన్నారు’ అని మంత్రి అతిశీ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
Some schools have received bomb threats today morning. Students have been evacuated and those premises are being searched by Delhi Police. So far nothing has been found in any of the schools.
We are in constant touch with the Police and the schools. Would request parents and…— Atishi (@AtishiAAP) May 1, 2024
దేశ రాజధాని పరిధిలో బుధవారం ఉదయం ఒక్కసారిగా అలజడి రేగింది. పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే పిల్లలను బయటకు పంపించి తనీఖలు చేపట్టింది. మరో వైపు ఈ సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో స్కూళ్ల వద్దకు చేరుకున్నారు.
ఇప్పటివరకు 100 పాఠశాలల్లో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చాణిక్య పురిలోని సంస్కృతి స్కూల్, అమిటి సాకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వార్డ్స్, పోలీసులు స్కూల్స్‌కు వద్దకు చేరుకొని వాటి ఖాళీ చేయించి తనిఖీలు చేశారు.
అయితే ఇప్పటి వరకు తనిఖీలు చేసిన పాఠశాలల్లో ఎలాంటి బాంబు లేవని, వచ్చింది నకిలీ బాంబు మెయిల్‌గా పోలీసులు గుర్తించారు. బయట దేశం నుంచి వీపీఎన్ మోడ్‌లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాంబు బెందిరింపుల నేపథ్యంలో స్కూల్స్ నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. బాంబు బెదిరింపు ఈ మెయిల్స్‌పై ఢిల్లీ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment