గంగాకావేరి నిండా ముంచింది
► ఆదుకోవాలని బాధిత రైతుల విన్నపం
► తక్కువ దిగుబడిపై ఆందోళన
► కంపెనీపై చర్య తీసుకోవాలని డిమాండ్
ఎకరాకు 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎకరాకు దాదాపు రూ.లక్ష వరకు ఆదాయం పొందవచ్చు అనే కంపెనీ ఏజెంట్ల మాయమాటలు నమ్మి మండలంలోని రైతులు మోసపోయూరు. గంగాకావేరి సీడ్ సాగుచేసిన రైతులు నట్టేట మునిగారు. కనీసం ఎకరాకు 3 క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కూడా మీద పడేలా ఉందని లబోదిబోమంటున్నారు. - సైదాపూర్‌రూరల్
మండలంలోని వెన్నంపల్లి, సోమారం, ఎక్లాస్‌పూర్ గ్రామాల్లోని దాదాపు 30 మంది వరకు రైతులు 40 ఎకరాల్లో గంగాకావేరి సీడ్ వరివిత్తనం సాగు చేశారు. కంపెనీ ఏజెంట్లు చెప్పిన మాటలతో ఒప్పందం చేసుకున్నారు. ఎకరాలకు రూ.లక్ష వరకు ఆ దాయం వస్తుందనే ఆశతో చాలా మంది రైతులు సా గుకు ముందుకొచ్చారు. అరుుతే తీర కోత సమయూనికి వచ్చే సరికి వరి వంగడం ఎదుగలేదు. పంట చూస్తే బా గానే ఉన్న ఎకరాకు 3 క్వింటాళ్లు కూడా వచ్చేల లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.30 వేల వరకుపెట్టుబడి పెట్టినట్లు రైతులు తెలిపారు. అధికారులు స్పందించి గంగాకావేరి యూజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అన్నీ తామై..
గంగాకావేరి సీడ్ బ్రాంచ్ ఒకటి శంకరపట్నం మండలం మొలంగూర్‌లో ఉంది. సమీప గ్రామాల్లో కంపెనీ ఏజెంట్లు రైతులతో ఒప్పందాలు చేసుకుని విత్తన సాగును ప్రోత్సహిస్తున్నారు. విత్తనాల నుంచి మొదలుకుని మందులు చల్లడం, కోత వరకు అన్నీ కంపెనీ ఆధ్వర్యంలోనే చేస్తారు. క్వింటాల్‌కు రూ.5వేలు చెల్లించేలా మండలంలోని రైతులతో కంపెనీ ఏజెంట్ ఒప్పందం చేసుకుని ఆడ, మగ విత్తనాలు ఇచ్చాడు. ఆడ విత్తనాలను కంపెనీ తీసుకుంటుండగా, మగ విత్తనాలను రైతులే బయట మార్కెట్‌లో విక్రరుుంచుకోవాలి. ఒప్పంద సమయంలో ఎక్కువ దిగుబడి వస్తుందని నమ్మబలికన ఏజెంట్ తీర పంట పరిస్థితి అధ్వానంగా ఉండగా.. రైతులు నిలదీయడంతో తనకేమి తెలియదని తప్పించుకున్నాడు.
కంపెనీ ఇచ్చిన విత్తనాలే తెచ్చానని తనకేమి సంబంధం లేదంటున్నాడని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు చేసిన రెక్కలకట్టంతోపాటు పెట్టుబడి కూడా మీద పడేలా ఉందని వారు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి సదరు కం పెనీపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయూలని కోరుతున్నారు. గంగాకావేరి సీడ్‌స ప్రొడక్షన్ ఇన్‌చార్జి సంపత్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. వాతావరణం అనుకూలించాలన్నారు. దిగుబడి ఎంత వస్తుందనేది వరికోత ముగిసిన తర్వాతే చెప్పవచ్చని తెలిపారు.
రూ.లక్ష అప్పుతెచ్చిన
రెండెకరాల్లో ఆడమగ గంగాకావేరి సీడ్ సాగు చేసిన. పెట్టుబడి రూ.50వేల వరకు అరుు్యంది. చేతికందే దశలో బావిలో నీళ్లు తగ్గడంతో రూ.70వేలు అప్పుచేసి రెండు గజాల లోతు తవ్వించి పొలం కాపాడుకున్న. ఇప్పుడు గొలుసుకు మూడు, నాలుగు గింజలు కూడా లేవు. రెండెకరాలు కోస్తే ఐదు క్వింటాళ్లు కూడా అచ్చేలా లేవు. అప్పులు తీర్చే మార్గం లేదు. ఏమి చేయాలో అర్థమైతలేదు. - మ్యాకల రాజిరెడ్డి, వెన్నంపల్లి
మోసం చేసిండ్రు
గంగాకావేరి సీడ్ యజమానులు, సూపర్‌వైజర్లు అంతా కలిసి మమ్ములను మోసం చేసిండ్రు. ఎకరానికి 20 క్వింటాళ్ల దాకా దిగుబడి అత్తదన్నరు. కానీ మూడు క్వింటాళ్లు కూడా అచ్చేలా లేదు. అప్పులు చేసి పంటల సాగు చేస్తే దిగుబడి రాక అప్పలే మిగిలేల ఉన్నారుు. అధికారులు సీడ్ యజమానులపై చర్యలు తీసుకోవాలి - పెసరి తిరుపతి, లస్మన్నపల్లి