ముంపు ముప్పులో వరి
వరిపంటను ముంపు బారి నుంచి రక్షించి కాపాడాల్సిన అవుట్‌ఫాల్ స్లూయిస్ షట్టర్లు పని చేయకపోవడంతో మురుగు దిగువకు పారక, సమీప పంటపొలాల్లో వేసిన నారుమళ్లు వర్షం ప్రభావంతో ముంపుబారిన పడుతున్నాయి. మండలంలోని ఉల్లిపాలెం సమీపంలోని లింగన్నకోడు మురుగు డ్రెయిన్‌కు కృష్ణాకరకట్టపై 1977 దివిసీమ ఉప్పెన అనంతరం నిర్మించిన అవుట్‌ఫాల్ స్లూయిస్ శి«థిలావస్థకు చేరింది.
పనిచేయని లింగన్నకోడు
అవుట్‌ఫాల్ షట్టర్లు
కిందికి వెళ్లేదారి లేక పొలాలను
ముంచెత్తుతున్న వర్షపునీరు
కోడూరు :
వరిపంటను ముంపు బారి నుంచి రక్షించి కాపాడాల్సిన అవుట్‌ఫాల్ స్లూయిస్ షట్టర్లు పని చేయకపోవడంతో మురుగు దిగువకు పారక, సమీప పంటపొలాల్లో వేసిన నారుమళ్లు వర్షం ప్రభావంతో ముంపుబారిన పడుతున్నాయి. మండలంలోని ఉల్లిపాలెం సమీపంలోని లింగన్నకోడు మురుగు డ్రెయిన్‌కు కృష్ణాకరకట్టపై 1977 దివిసీమ ఉప్పెన అనంతరం నిర్మించిన అవుట్‌ఫాల్ స్లూయిస్ శి«థిలావస్థకు చేరింది. దీంతో మూడు సంవత్సరాల క్రితం డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా శిథిలమైన స్లూయిస్ పక్కనే మళ్లీ డ్రెయిన్‌పై నాలుగు షట్టర్లతో కూడిన నూతన అవుట్‌పాల్ స్లూయిస్‌ను నిర్మించారు. నిర్మాణ సమయంలో అధికారులు ఈ ప్రాంత స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని, కృష్ణానది వైపు స్లూయిస్‌కు ఆటోమెటిక్ షట్టర్లు అమర్చారు. ఈ షట్టర్ల వల్ల సముద్రం నీరు పోటు సమయంలో డ్రెయిన్‌లోకి రాకుండా, మురుగు ఎక్కువైతే షట్టర్లు దానంతట అవే తెరుచుకుని నదిలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. దీంతో విశ్వనాథపల్లి, నరసింహాపురం, ఉల్లిపాలెం, జయపురం, తదితర గ్రామాల్లోని రైతులకు చెందిన సుమారు మూ డు వేల ఎకరాల్లో పంట మునకబారిన పడకుండా ఏటా వరిసాగు చేస్తున్నారు. లింగన్నకోడుకు ఎగువ భూముల్లోని కొందరు రైతులు కాలువ వెంట వచ్చే కొద్దిపాటి నీటిని నిలువరించేందుకు అవుట్‌పాల్ స్లూయిస్‌కు మళ్లీ రెండో వైపు మ్యాన్యువల్ షట్టర్లను ఏర్పాటు చేశారు. వీటి సహకారంతో ఆయిల్ ఇం జన్ల ద్వారా ఎగువ రైతులు నారుమళ్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మ్యాన్యువల్ షట్టర్లు పూర్తిగా బిగుసుకుపోయి, మురుగును కిందకు వెళ్లనివ్వడం లేదు.
పట్టించుకోని అధికారులు
వర్షం నీరు కిందకు వెళ్లేందుకు దారి లేక పంటపొలాల్లోకి నీళ్లు వచ్చేశాయి. దీంతో ఉల్లిపాలెం, నరసింహపురం, విశ్వనాథపల్లి, జయపురం గ్రామాల్లోని రెండు వేల ఎకరాలు ముంపుబారిన పడ్డాయని రైతులు వాపోతున్నారు. ్రyð యినేజీ అధికారులు సైతం వచ్చి షట్టర్లు చూసి వెళ్లారే తప్ప, వాటిని తొలగించే ప్రయత్నం చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అవుట్‌పాల్ స్లూయిస్‌కు ఏర్పాటు చేసిన మ్యాన్యువల్ షట్టర్లు తొలగించని పక్షంలో ఈ ఏడాది వరిపంట సాగు చేసే పరిస్థితి లేదని, వీటిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.