
మంత్రి నిరంజన్ రెడ్డి (ఫైల్)
న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంచాలా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రి పీయుష్ గోయల్‌ని అడిగినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై కేంద్రం రెండు రోజుల్లో రాతపూర్వక హమీని ఇవ్వాలన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రైల్వే రెక్స్ కేటాయించకపోవడం వల్లే.. రబీ బియ్యం సరఫరా పూర్తికాలేదన్నారు. తాము రాజకీయాల కోసం రాలేదని.. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజల కోసమే వచ్చామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment