వర్షంతో దెబ్బతిన్న వరి
Published Sat, Apr 29 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM
రుద్రవరం: అకాల వర్షంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రుద్రవరం మండలంలో గురువారం రాత్రి గంటకు పైగానే గాలివాన బీభత్సం సృష్టించింది. రుద్రవరం, ఆలమూరు, ముత్తలూరు, టి. లింగందిన్నె, తదితర గ్రామాలలో కోత దశలో ఉన్న 500 ఎకరాల్లో వరి నేల కొరిగింది. అలాగే మామిడి కాయలు నేలరాలి రైతులకు నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన పసుపు తడిసి ముద్దయింది.
Advertisement
Advertisement