
సాక్షి, న్యూఢిల్లీ: వరికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో రైతుల ‘మద్దతు’ పొందేందుకు ఈ నిర్ణయం తీసుకోనుంది. ఖరీఫ్ సీజన్‌లో ప్రధాన పంట అయిన వరికి 2018–19లో 13 శాతం పెంపుతో క్వింటాలుకు రూ.1,750 చెల్లించనుంది. మరో 13 రకాల ఖరీఫ్ పంటల మద్దతు ధరను కూడా స్వల్పంగా పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మద్దతు ధర పెంపుపై కేంద్రం ఈ వారంలోనే నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత ఏడాదిలో వరికి క్వింటాలుకు రూ.1,550 (సాధారణ రకం) కనీస మద్దతు ధరను కేంద్రం చెల్లిస్తోంది. గ్రేడ్–ఏ పంటకు రూ.1,590 చెల్లిస్తోంది. ‘ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర వివరాలను ఇప్పటికే ప్రకటించాల్సి ఉన్నా.. కేంద్రం ఆలస్యం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment