
శిబిరంలో మాట్లాడుతున్న మనోహర
తక్కువ సమయంలో చేతికందే వరి పంటలను మాత్రమే రైతులు సాగు చేసుకోవాలని మెదక్ ఏడీఏ మనోహర తెలిపారు.
మెదక్ రూరల్: తక్కువ సమయంలో చేతికందే వరి పంటలను మాత్రమే రైతులు సాగు చేసుకోవాలని మెదక్ ఏడీఏ మనోహర తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామంలో రైతు శి„ýక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో గురువారం 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని, ఈ ఏడు కురిసిన వర్షాల్లో ఇదే అత్యధికం అన్నారు.
కాగా, వరిపంట సాగు కోసం ప్రస్తుతం నారుమళ్లు పోసుకోవద్దని, తప్పనిసరి అయితే డ్రమ్‌సీడర్ ద్వారా విత్తుకోవాలని చెప్పారు. నారుమళ్లు పోసి అధిక సమయం అయినందున నాట్లు వేసేటప్పుడు తప్పనిసరిగా వరినారు కొనలు తుంచాలని సూచించారు. లేనిపక్షంలో తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సాగు చేసేటప్పుడు పంటపై సూర్యరశ్మి పడేలా నాటును దూరంగా వేయాలన్నారు. పొలంగట్లపై ఎప్పటికప్పుడు గడ్డిని తొలగించాలని, దీనివల్ల గాలి వెలుతురు ఆడుతుందన్నారు. తుగుళ్లు సోకితే వ్యవసాయ అధికారుల సూచనలు పాటించానలన్నారు. కార్యక్రమంలో అధికారులు శైలజ, శ్రీకాంత్, సంపత్, సర్పంచ్ లింగం తదితరులున్నారు.