108 వాహనంలో తల్లిబిడ్డ..
సాక్షి, జీడిమెట్ల: పురిటి నొప్పులు భరించలేక రోడ్డుపై పడిపోయిన ఓ యాచకురాలికి 108 సిబ్బంది ఓ మహిళా కానిస్టేబుల్ సహాయంతో పురుడు పోశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో ఐడీపీఎల్‌లోని డొమినోస్ సందులో ఓ గర్బిని పురిటి నొప్పులతో అవస్థ పడుతున్నట్లు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే వారు 108 సిబ్బంది రాజు, శ్రీనివాస్‌లకు విషయం తెలిపి ఐడీపీఎల్ వద్దకు వాహనం పంపించారు. అప్పటికే ప్రసవ వేదనతో తల్లడిల్లుతున్న మహిళకు 108 సిబ్బంది ఓ లేడీ కానిస్టేబుల్ పురుడు పోయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జీడిమెట్ల సీఐ వపన్ సూచన మేరకు సదరు మహిళను 108 సిబ్బంది గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఎవరు ఆమె!
సదరు మహిళను పోలీసులు, 108 సిబ్బంది వివరాలు అడగగా తన పేరు కృష్ణవేణి అని తాను యాచకురాలిని అని తెలిపింది. దీంతో పాటు తనకు ఎవరూ లేరంటూ ఒంటిరిగా ఉంటూ భిక్షాటన చేస్తున్నట్లు మాత్రమే తెలిపిందని పోలీసులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment