సాక్షి, నల్గొండ: జిల్లాలో దారుణం చోటు జరిగింది. పురిటి నోప్పులతో బాధపడుతున్న ఓ మహిళను ఆసుపత్రికి తరలించడానికి సరైన సమయానికి 108 వాహనం రాకపోవడంతో సదరు మహిళ రోడ్డుపైనే ప్రసవించిన ఘటన సూర్యపేటలో బుధవారం అర్థరాత్రి చేసుకుంది. బాధిత మహిళ అర్వపల్లి మండలం రామన్న గూడెంకు చెందిన దండకొండ వెంకన్న భార్య రేష్మ. ఆమె గర్భవతి కావడంతో నిన్న అర్థరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. ఇక వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సమయానికి రాలేదు.
దీంతో బాధిత మహిళ భర్త వెంకన్న తన ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా సూర్యపేట పాతబస్టాండ్ వద్దకు రాగానే ఆమె దారిలోనే ప్రసవించింది. ఇంతలో పేన్ పహాడ్ నుంచి వస్తున్న 108 వాహనంలో ఆమె స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు ఆమె భర్త వెంకన్న తెలిపాడు. కాగా లాక్‌డౌన్ కారణంగా అంతటా భారీకేడ్లు ఏర్పాటు చేశారని, అంబులెన్స్ కూడా రాకపోవడం వలన సమయం మించిపోవడంతో తన భార్య రోడ్డు మీదనే ప్రసవించిందని బాధితుడు మీడియా ఎదుట వాపోయాడు. ఇక ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంటును మీడియా వివరణ కోరగా వారు దురుసుగా ప్రవర్తిస్తూ.. సమాధానం ఇచ్చి విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment