
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కలకలంతో అంబులెన్సులను ఆశ్రయించి ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి లాంటి లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా 108 అంబులెన్సులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థ లేకపోవడంతో కరోనా అనుమానంతో మార్చి నెలలో రాష్ట్రవ్యాప్తంగా 3,614 మంది అంబులెన్సులను ఆశ్రయించారు. ఫోన్ చేసిన 20 నిముషాల్లోపే బాధితుడి ఇంటివద్దకు 108 చేరుకుంటున్నట్లు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
► మార్చిలో ఒక్క ప్రకాశం జిల్లాలోనే 492 మంది కరోనా అనుమానంతో అంబులెన్స్ కోసం ఫోన్లు చేశారు.
► రోజుకు సగటున 120 మంది చొప్పున వైరస్ లక్షణాలతో అంబులెన్సులను ఆశ్రయించారు.
► అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18 మంది మాత్రమే ఫోన్లు చేశారు.
► 108 పైలెట్‌లకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ కిట్‌లు అందచేశారు.
108 అంబులెన్స్‌ల సేవలపై ప్రశంసలు