
ప్రతీకాత్మక చిత్రం
గద్వాల రూరల్: ప్రాణాంతక కరోనా వైరస్ సోకిన ఓ గర్భిణికి 108 సిబ్బంది కాన్పు చేసి మానవత్వం చాటారు. జోగుళాంబ గద్వాల ధరూరు మండలం వామన్‌పల్లికి చెందిన నర్సమ్మకు ఈ నెల 1న కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున నర్సమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఉప్పేరు పీహెచ్‌సీ ఏఎన్‌ఎం హైమావతికి సమాచారం అందించారు.
దీంతో, ఆమె 108 వాహనంలో నర్సమ్మను గద్వాలలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే నర్సమ్మకు నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది మార్గమధ్యలోనే కాన్పు చేశారు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. సుఖ ప్రసవం చేసిన సిబ్బందిని ఉప్పేరు పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయరాజు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment