కొత్తగా రానున్న 108 అంబులెన్స్ వాహనాలు
కర్నూలు(హాస్పిటల్): ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే ఓ అంబులెన్స్ వచ్చి ప్రథమ చికిత్స చేస్తూ ఆసుపత్రికి తరలించడం 15 ఏళ్ల క్రితం వరకు మనం చూడలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ కలను నిజం చేశారు. ప్రజలకు 108 అంబులెన్స్ సేవల ద్వారా అత్యవసర వైద్యాన్ని అందిస్తూ ఎన్నో నిండుప్రాణాలు కాపాడారు. ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రివైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ అంబులెన్స్‌కు మరింత మెరుగులు దిద్ది ఆధునిక హంగులు అద్ది ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్యసేవలు అందించేలా తీర్చిదిద్దారు. జులై ఒకటో తేదీ నుంచి వీటిని రోడ్డుపైకి తీసుకొచ్చి అమలు చేయనున్నారు. జిల్లాలో 108 అంబులెన్స్ వాహనాల ద్వారా అత్యవసర సేవలు 2005లో ప్రారంభమయ్యాయి. మొదట్లో నాలుగు వాహనాలు(కర్నూలు, ఆదోని, నంద్యాల, శ్రీశైలం) ప్రారంభించారు. అనంతరం 2006లో మరో 28 వాహనాలు వీటికి జతచేరాయి.
ఆధునికత రంగరించుకుని రయ్ రయ్ మంటూ...
వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. తన తండ్రి ప్రారంభించిన పథకమైన 108 అంబులెన్స్ సేవలను మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. గతంలో 32 వాహనాలు ఉండగా ఇప్పుడు ప్రతి మండలానికి ఒకటితో పాటు కర్నూలులో నాలుగు వాహనాలు, రెండు నియోనేటల్ వాహనాలను కలిపి మొత్తం జిల్లాకు 60 వాహనాలు కేటాయించారు. ప్రతి వాహనానికి ఒక పైలెట్, ఒక ఎంఎల్‌టితో పాటు ప్రతి వాహనాలకు రిలీవర్స్‌గా ఒక్కొక్కరు చొప్పున మొత్తం 180 మంది ఉద్యోగుల నియమించారు.
108 అంబులెన్స్ ప్రత్యేకతలు ఇవీ..
♦ ఆదోని, నంద్యాలలకు ఒక్కోటి చొప్పున నియోనేటల్ అంబులెన్స్‌లు
♦ 13 అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్(ఏఎల్‌ఎస్), 42 బేసిక్ లైఫ్ సపోర్ట్(బీఎల్‌ఎస్) వాహనాలు
♦ నడిచే ఐసీయు తరహాలో ఏఎల్‌ఎస్ సౌకర్యం ఉన్న వాహనంలో వెంటిలేటర్, డీఫిబ్రిలేటర్, ఇన్‌ఫ్యూజన్ పంప్స్, సిరంజి పంప్స్ ఏర్పాటు
♦ ప్రతి అంబులెన్స్‌లో ఆక్సీజన్, సక్షన్ ఆపరేటర్స్, మల్టీ పారా మానిటర్స్
♦ ప్రతి వాహనంలో నియోనేటల్ వార్మింగ్ బ్లాంకెట్స్
♦ అత్యవసర మందులన్నీ అందుబాటులో...
Comments
Please login to add a commentAdd a comment