కీసర: నెలలు పూర్తిగా నిండకుండా.. గుండె చప్పుడు లేకుండా అప్పుడే పుట్టిన మగబిడ్డకు సీపీఆర్ చేసి కీసర 108 సిబ్బంది ప్రాణాలు కాపాడారు. వివరాలివి. కుందన్‌పల్లిలోని కోళ్లఫాంలో పనిచేసే ఆర్తికుమారి పురిటినొప్పులతో కీసరలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు నెలలు పూర్తిగా నిండకపోవడం.. పుట్టబోయే బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేనందున గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
గర్భిణిని 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే ఈఎంటీ చిత్రం రవి వాహనంలోనే ఆమె సుఖప్రసవం చేశారు. పుట్టిన మగబిడ్డ బరువు తక్కువగా ఉండి నాడి, శ్వాస గుండెచప్పుడు లేకపోవడం గమనించి ఈఆర్‌సీపీ వైద్యుడు మహీద్‌ను ఫోన్లో సంప్రదించారు. ఆయన సూచన మేరకు బిడ్డకు సీపీఆర్ చేసి అంబు బ్యాగ్‌తో శ్వాస అందిస్తూ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల బిడ్డకు ప్రాణాపాయం తప్పిందని పేర్కొని 108 సిబ్బందిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment