సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య విప్లవం తీసుకొచ్చారని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఆయన గురువారం జిల్లాకు కేటాయించిన 61 108,104 వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యానికి సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రతీ పేదవానికి కార్పోరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తున్నాయని తెలిపారు. (టీడీపీ 108, 104లను నిద్రావస్థలో ఉంచింది: పిల్లి)
కరోనా కష్ట కాలంలో రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా వెయ్యికిపైగా 108, 104 వాహనాలు ప్రారంభించడం అభినందనీయమని అవంతి అన్నారు. ఇక పేదవాడి ఆరోగ్యానికి డోకా లేదని స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో ఈ వాహనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నాడు వైఎస్సార్ ప్రవేశపట్టిన పధకాలకి నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పునర్జీవం పోశారని కొనియాడారు. (ప్రజారోగ్య రథయాత్ర)
ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ నిరుపేదలకి ఉపయోగపడేలా వెయ్యికి పైగా అంబులెన్స్ వాహనాలు ప్రారంభించడం అభినందనీయం అన్నారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా విప్లవాత్మకమైన పధకాలతో సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తాను కూడా పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఒక వైద్యురాలిగా సీఎం వైఎస్ జగన్ పధకాలపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. 104 వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఇంటి వద్దకే డాక్టర్లు, వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.(దేశంలోనే కొత్త రికార్డు: సీఎం జగన్)
పాడేరు ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. 108,104 వాహనాల ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజారోగ్యంపై ఆయన ఎంతశ్రద్ధ కనబరుస్తున్నారో అర్ధమవుతోందని తెలిపారు. గిరిజనులకి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 104 అంబులెన్స్ వాహనాలు ఉపయోగపడతాయని చెప్పారు. గిరిజనులకి వైద్య విద్య అందించేందుకు సీఎం వైఎస్ జగన్ పాడేరులో మెడికల్ కళాశాలని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ వల్ల వైద్య, విద్యా రంగాల్లో సమూల మార్పులు రాబోతున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో 108,104 వాహనాలు షెడ్లో ఉన్నాయని తెలిపారు.
బాబు తన పాలనలో ఒక్కరోజు కూడా వాటి గురించి పట్డించుకోకుండా ఇపుడు విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 2023లో టీడీపీ గల్లంతు కావడం ఖాయమని విమర్సించారు. ఇంత పెద్ద స్ధాయిలో 108,104 వాహనాలు ప్రారంభించడంపై ముఖ్యమంత్రిని అభినందించాలన్నారు. ప్రజా సంక్షేమానికి అంకితమైన ముఖ్యమంత్రి కాబట్టే తన పాలనతో తొలి ఏడాదిలోనే దేశంలోనే నాలుగో స్ధానంలో నిలిచారని కొనియాడారు.
నాడు వైఎస్సార్ వైద్య, విద్యా రంగాలకి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా ఆయన కీర్తి దేశ విదేశాల్లో మారుమోగిందని తెలిపారు. ఆయన తనయుడిగా తండ్రిని మించిన స్ధాయిలో పేదల సంక్షేమానికి కృషిచేస్తున్నారని ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, భాగ్య లక్ష్మి, జేసీ అరుణ్ బాబు, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, వైద్య ఆరోగ్యా శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment