రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. వారి వేతనాలను పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 108, 104 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంను కలసి వేతనాలు పెంచాలని విన్నవించారు. వారి వినతి పట్ల సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసిన అనంతరం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. తమ కష్టాన్ని గుర్తించి వేతనాల పెంపుదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇవ్వడం పట్ల హర్షం వెలిబుచ్చారు.