
బోధన్‌లో ఓ రోగి నిర్వాకం
బోధన్ టౌన్ (బోధన్): అత్యవసర వైద్య సేవలకు వినియోగించాల్సిన 108 అంబులెన్స్‌ను ఓ ప్రబుద్ధుడు మద్యం కొనుగోలు కోసం దుర్వినియోగం చేసిన ఘటన బోధన్‌లో చోటు చేసుకుంది. ఎడపల్లి మండలంలోని ఏఆర్‌పీ క్యాంప్ గ్రామానికి చెందిన శంకర్ మంగళవారం రాత్రి తన ఆరోగ్యం బాగా లేదని 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.
ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకొని బోధన్‌లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది శంకర్ పేరు నమోదు చేసుకొని కొద్దిసేపట్లో డాక్టర్ వస్తారు.. కూర్చోమని చెప్పారు. అయితే ఈలోగా శంకర్ ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లి కొద్ది దూరంలో ఉన్న మద్యం దుకాణానికి చేరుకొని మద్యం కొనుగోలు చేస్తుండగా గమనించిన 108 సిబ్బంది శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment