
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లో 108 అంబులెన్స్ లు ఎలా పని చేస్తున్నాయన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవ్వాళ శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. రాజం దాటాకా పాలకొండ లైన్ సెర్లాం జంక్షన్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఎదురెదురుగా వస్తోన్న రెండు బళ్లు ఢీ కొట్టుకున్నాయి. ఇందులో విజయనగరం జిల్లా ఎర్రవానిపాలెంకు చెందిన పార్ధు (35) పాపారావు (32) గాయపడ్డారు.
ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు.. వెంటనే 108కి కాల్ చేశారు. సరిగ్గా అయిదు నిమిషాల్లోనే రెండు వైపుల నుంచి రెండు వేర్వేరు అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులకు వేగంగా ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు 108 సిబ్బంది.