
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తోంది. తెలంగాణ వైద్యశాఖకు కొత్తగా మరో 466 వాహనాలను ప్రభుత్వం కేటాయింది. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద అమ్మ ఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాలను మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి వాహనాలు(102), 34 హర్సె వెహికిల్స్ ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు.
చదవండి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్.. మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment