సాక్షి, అమరావతి: వెయ్యికి పైగా అత్యాధునిక సదుపాయాలు కలిగిన అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బుధవారం ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాజెక్టులో సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసు పాలు పంచుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. (దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం : సీఎం జగన్)
108 అత్యవసర అంబులెన్స్ సర్వీసులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్ల ప్రాజెక్టుల్లో టెక్నికల్, లీడ్ పార్టనర్లుగా ఉన్న అరబిందో ఫార్మా, యూకేకి చెందిన నేషనల్ హెల్త్ సర్వీసులో భాగమైన సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసులకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. (గొప్ప పాలసీని తీసుకొస్తున్నాం : మంత్రి మేకపాటి)
Comments
Please login to add a commentAdd a comment