ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. మనిషి ప్రాణం విలువ తెలిసిన నాయకుడు. అందుకే సీఎం అయ్యాక ప్రజారోగ్యానికి సైతం పెద్దపీట వేశారు. తన నాలుగేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యారు సీఎం జగన్. రెండేళ్ల క్రితం ఒకేసారి 1180 అంబులెన్స్‌లను ప్రారంభించి ప్రజారోగ్యం ఎంత ముఖ్యమో చాటి చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకానికి కూడా మరింత వన్నె తెచ్చారు సీఎం జగన్.
జగన్ సీఎం కాకముందు కూడా ప్రజారోగ్యం పట్ల ఎంతో నిబద్ధతగా ఉండేవారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఓ బహిరంగ సభ జరుగుతుండగా ఒక అంబులెన్స్ జనం మధ్యలోకి వచ్చి చిక్కుకుపోయింది. ఆ సమయంలో ఆ అంబులెన్స్‌ను గమనించిన సీఎం జగన్.. దానికి దారి ఇవ్వమని అక్కడ ఉన్న జన సమూహానికి విజ్ఞప్తి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
మరి యువగళం పేరుతో ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్.. తన సభ జరుగుతున్న సమయంలో అంబులెన్స్ వచ్చినా దారి ఇవ్వలేదు.. కనీసం దారి ఇవ్వమని అక్కడున్న ప్రజలకు కూడా పిలుపునివ్వలేదు. ఒకరు ప్రాణం విలువ తెలిసిన నాయకుడు సీఎం జగన్ అయితే లోకేశ్ మాత్రం ప్రజల ప్రాణం అంటే లెక్కలేనితనంగా వ్యవహరించిన ‘నారా’ వారి వారసుడు.
Comments
Please login to add a commentAdd a comment