పనులు పరిశీలిస్తున్న మదనపల్లె ఇరిగేషన్ ఈఈ సురేంద్రరెడ్డి
పీలేరురూరల్ : మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె ని యోజకవర్గాల్లో 12 చెరువుల అభివృద్ధికి రూ. 4.98 కోట్లు నిధులు మంజూరైనట్లు మదనపల్లె ఇరిగేషన్ ఈఈ సురేంద్రరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చింతలచెరువు అభివృద్ధి పనులను ఆయన ప రిశీలించారు. ఆయన మాట్లాడుతూ పీలేరు నియో జకవర్గంలో పీలేరు మండలం చింతలచెరువుకు రూ.22 లక్షలు, కేవీపల్లె మండలం అమ్మగారిచెరువు కు రూ. 29 లక్షలు, కలకడ మండలం కదిరాయుని చెరువుకు రూ. 24 లక్షలు నిధులు మంజూరు అ య్యాయని చెప్పారు.
అలాగే కలికిరి మండలంలో పెద్ద ఒడ్డు, మల్లిసముద్రం, దిగువ చెరువుకు రూ. 57.50 లక్షలు, తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలం పెద్దచెరువుకు రూ. 22 లక్షలు, బి.కొత్తకోట మండలం పెద్దచెరువుకు రూ. 33 లక్ష లు, పీటీఎం మండలం పెద్దచెరువుకు రూ. 49 లక్ష లు, తంబళ్లపల్లె మండలం రాతిచెరువుకు రూ. 47 లక్షలు, పెద్దమండ్యం మండలంలో మర్రికుంట చెరువు, పొట్టివానికుంట, ముసలికుంటకు రూ. 43 లక్షలు, మదనపల్లె మండలం సీటీఎం పెద్దచెరువుకు రూ. కోటి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇరిగేషన్ డీఈ ప్రసన్నకుమారి, ఏఈ ఎత్తిరాజులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment